మహేష్‌ సరసన బాలీవూడ్ భామ

13 Mar,2019

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న మహర్షి షూటింగ్ నేటితో పూర్తయింది. ఈ సినిమా తరువాత అయన నటించే తదుపరి చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేష్  సరసన బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా నటించనుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఎఫ్‌ 2 వంటి సూపర్‌హిట్‌ సినిమా అందించిన అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాలో మహేష్‌ సరసన నటించే హీరోయిన్లలో సాయిపల్లవి, రష్మిక మండన్నా పేర్లు విని పించాయి. తాజాగా సోనాక్షి పేరు చేరింది. దీనిపై అధికారిక సమా చారం లేనప్పటికీ, మహేష్‌ ఎక్కువగా బాలీవుడ్‌ నాయికలతో నటిస్తున్న విషయం తెలిసిందే. మహర్షి సినిమా తర్వాత అనీల్‌ రావిపూడి సినిమా షూటింగ్‌ ప్రారంభించే అవకాశాలున్నాయి.

Recent Gossips