సినీ రాజకీయ సమక్షంలో 'ప్రేమిక" పాటల విడుదల
ఎస్ వి ఎన్ రావు సమర్పణలో దేశాల ఆర్ట్ మూవీస్ పతాకంపై, స్టార్ లైన్ మూవీస్ నిర్మాణం లో తనీష్ ,శృతి యుగళ్ హీరో ,హీరోయిన్ లు గా నటించిన చిత్రం " ప్రేమిక" నూతన నిర్మాత దేశాల లక్ష్మయ్య నిర్మిస్తుండగా .మహేంద్ర దర్శకత్వం వహించారు.
చిత్రం ఆడియో ఇటీవల రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు మధ్య అంగ రంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలు :యమ్ యల్ ఎ రసమయి బాలక్రిష్ణ ,నేను లోకల్ దర్శకుడు త్రినాథ్ రావ్, డాన్స్ మాస్టర్ గణేష్, ,మన్నెం గోవర్ధన్ రెడ్డి,కోవ లక్ష్మీ ,పురాణం సతీష్, బుక్కా గోపాల్,చిన్మయి,ఉమ, వెంకట కృష్ణ, జలగం జగన్,శివకుమార్,బొంతు శ్రీదేవి, గట్టు రామచంద్రా రావు మొదలగు వారు పాల్గొన్నారు.
చిత్రం ఆడియో పాటలు మాంగో మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.తెలుగు కబాలి ప్రొడ్యూసర్, గణేష్ మాస్టర్, త్రినాద్ రావు లు బిగ్ సి డి రిలీజ్ చేశారు. ఆడియో సి ,డీ.లను త్రినాథ్ రావు చేతులు మీదగా చిత్ర యూనిటీకి అంద జేసారు.చిత్రసమర్పకుడు ఎస్ వి ఎన్ రావు మాట్లాడుతూ... ."లవ్ అండ్ మదర్ సెంటిమెంట్ తో నాచురాలిటీకి అతి దగ్గర లో పల్లెటూరి బ్యాగ్రౌండ్ లోనడిచే ఈ కథ లో కొంతమంది అల్లరి చిల్లర గా అమ్మాయిలు వెనుకతిరిగే యువకులకు ,అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలంటే ప్రేమిస్తే సరిపోద్ది , అదే అమ్మాయిని పోషించాలంటే సంపాదించాలి అన్న నిజం తెలుసుకున్న మరుక్షణం వాళ్ళ జీవితంలో కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, వాళ్ళ ప్రేమలోను ,జీవితంలో ను గెలిచారా? ఓడారా ? అన్నది ఈచిత్రం లోని ముఖ్యఅంశం, ఎమోషన్ కమర్షియల్ టచ్ తో ఉద్వేగ భరితంగా ఈ కథ రూపుదిద్దుకున్నది . మంచి మెలోడితో ఎనిమిది పాటలను నూతన సంగీత దర్శకుడు దిలీప్ బండారి కంపోజ్ చేశారు.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... ఇది నా మొదటి సినిమా ఒక మంచి ప్రేమ కడతో మీ ముందుకు రావడానికి లక్ష్మయ్య నాకు ఈ అవకాశం ఇచ్చారు నేను ఎప్పటికి లక్ష్మయ్య కు రుణపడి ఉంటాను నా టీమ్ అందరికి నాకు సపోర్ట్ చేసినవారందరికి నా కృతఙ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అని అన్నారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ... నేను ఈ ఫీల్డకి కొత్త సినిమా అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ సినిమా చేయడం జరిగింది,మహేంద్ర నాకు కథ చెప్పగానే నాకు చాలబాగా నచ్చింది, అందుకే వెంటనే ఒప్పుకున్నాను,మొత్తం టీమ్ రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి పనిచేశారు,ఇది చిన్న సినిమా కాదు పెద్ద సినిమా గా చేసాం ,సెప్టెంబర్ ఎనిమిది తారీకున రిలీజ్ చెయ్యడానికి సిద్ధం చేస్తున్నాం అని అన్నారు.
హీరో తనీష్ మాట్లాడుతూ... మహేందర్ నాకు కథ సెప్పినప్పుడు నేను చేయగలనా ?అనే సందేహం నాకు కలిగింది,నా కెరీర్ కి ఇంత మంచి కథ ఇచ్చినందుకు దర్శకుడు మహేందరికి ,నిర్మాత లక్ష్మయ్యకు చేపప్పుకుంటున్నాను,కెమెరా వర్క్ రాహుల్ టేకింగ్ బాగుంది, దిలీప్ సంగీతం కి ప్రాణం పోసాడు ఈ సినిమాకి ఆల్ డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులు లాగ పనిచేశారు అని అన్నారు.ఇంకా ఈ చిత్రంలో కవిత, రవివర్మ,వైభవ్ సూర్య,కోటేశ్వరరావు, బ్యాంక్ సురేష్,జబర్దస్త్ మహేష్,దేవా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ మాచినేని,సంగీతం: దిలీప్ బండారి,ఎడిటర్: ప్రవీణ్ పూడి.విజువల్ఎఫెక్ట్స్ : నవీన్,.నిర్మాత: దేశాల లక్ష్మయ్య,కథ, స్క్రీన్ ప్లే ,మాటలు,దర్శకత్వం: మహేంద్ర