Nayantara Joins NBK102 Shooting in Hyderabad

21 Aug,2017

నందమూరి బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన నయనతార 

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకొన్న ఈ చిత్రంలో నయనతారను కథానాయికగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నేటి నుండి ఆమె ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటుంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షెడ్యూల్ ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోంది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ.. ""సింహా, శ్రీరామరాజ్యం" లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అనంతరం బాలకృష్ణ-నయనతార కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఆ సినిమాల స్థాయిలోనే ఈ సినిమాలోనూ వారి మధ్య కెమిస్ట్రీ ఉండనుంది. బాలకృష్ణగారి కెరీర్‌లోనే ఇది మరో సంచలన చిత్రం అవుతుంది" అన్నారు.

బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, మురళీమోహన్, బాహుబలి ప్రభాకర్, శివపార్వతి తదితరులు ఇతరముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, యాక్షన్: అంబరీవ్, కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, కో-ప్రొడ్యూసర్‌: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సి.తేజ, సి.వరుణ్‌కుమార్‌, నిర్మాత: సి.కళ్యాణ్‌, దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌.

Recent News