కథానాయిక సమంతకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ థ్యాంక్స్ చెప్పడమే కాకుండా పోచంపల్లి చీరను గిఫ్ట్ గా ఇచ్చారు.
ఇంతకీ విషయం ఏమిటంటే...కెటీఆర్ ను సమంత కలిసి చేనేతకు మద్దతు ప్రకటించారు. అంతే కాకుండా రాష్ట్ర చేనేత సహకార సంస్ధకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు కూడా సమంత అంగీకరించారు.
చేనేత సహకార సంస్థ టీఎస్ పీవో కార్యక్రమాలలో కలసి వర్క్ చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సమంతకు కెటీఆర్ పోచంపల్లి చీరను బహుమతిగా ఇచ్చారు. వారానికి ఒక రోజు చేత వస్త్రాలు ధరిస్తామని నాగార్జున, అమల ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఇప్పుడు సమంత కూడా చేనేతకు మద్దతు ప్రకటించడం విశేషం.