తెలుగు టీవీ ఛానళ్ళ టి.ఆర్.పి. రేటింగ్స్‌ను అమాంతం పెంచేసిన ‘డ్రగ్స్ డ్రామా’దాదాపు పూర్తయిన తరువాత చిత్రపరిశ్రమ నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని, సిట్ అధికారును అభ్యర్తిస్తూ, దేబెరిస్తూ ఒక లెటర్ వెళ్ళింది. సున్నితంగా విచారించండి, మెత్తగా మొట్టండి., అనే సారాంశంతో వెళ్ళిన ఆ లెటర్ పరిశ్రమలో చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తే సంచనా రామ్ గోపాల్ వర్మకు మాత్రం దానితో చిర్రెత్తుకొచ్చింది. అందుకే ఫిలిం చాంబర్‌ను అడ్రస్‌చేస్తూ ఒక బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించాడు రాంగోపాల్ వర్మ. డ్రగ్స్ స్కాం వ్ల వచ్చిందనుకున్న అపఖ్యాతికంటే అనవసరంగా, అసంధర్భంగా చిత్ర పరిశ్రమ సాగిపడి పోవటం వ్లనే ఎక్కువ అపఖ్యాతి వచ్చిందన్న రాంగోపాల్ వర్మ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవిస్తున్నారు. కేవం నిందితులైన వాళ్లను నేరస్థుగా తామే ఆమోదిస్తూ వాళ్ళ కారణంగా మా అందరి పరువు పోతుందనే అనవసర ఆందోళన వ్యక్తం చేయటం వెనుక ఆంతర్యం ఏమిటి? కేసు విచారణ ప్రాధమిక దశలో ఉండగా 11 పేర్లతో తొలి జాబితా మాత్రమే వచ్చింది. మరి కొందరు సినీ ప్రముఖు పేర్లతో రెండవ జాబితా వ్లెడిస్తాం అని సిట్ అధికాయి చెప్తుండగా ఈ బహిరంగ లేఖ రాయవసిన అగత్యం ఏమిటి? అయినా జులై 19 నుండి రోజుకొకరి చొప్పున సిట్ ఆఫీసుకు పిలిపించి గంటకొద్దీ సుధీర్ఘ విచారణ జరిపారు.
ఆ 11 రోజుపాటు మీడియాలో జరిగిన నిరంతర ప్రసారా కుంభమేళా వ్ల పరిశ్రమ ప్రతిష్టకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి అంతా అయిపోయిన తరువాత ఆ లేఖ ఎందుకు? అలా సాగిపడడం ఎందుకు? మొదటి జాబితా వారిని నేరస్థుగా వీళ్ళే తేల్చేసారు. వాళ్ళకు, వాళ్ళ కుటుంబాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరి వీరి అత్యవసర ఆందోళన, ఆత్రం రాబోతుందనుకుంటున్న రెండవ జాబితా గురించా? అందులో వ్లెడికానున్న ప్రముఖు పేర్ల గురించా? ఎందుకు? అయిపోయిన పెళ్ళికి మేళం వాయించడం ఎందుకు? జరిగిపోయిన తద్దినానికి పిండాు పెట్టడం ఎందుకు?
అయినా నేర తీవ్రతను బట్టి విచారణ తీవ్రత ఉంటుంది గానీ ప్రాధేయపడినంత మాత్రాన డిస్కౌంట్లు, రిబేట్లు ఇస్తారా? నేరస్థుగా రుజువైతే శిక్ష తప్పదు. కేవం నిందితుగానే బయట పడితే సంతోషం. అంతేగానీ సంచనం సృష్టించిన డ్రగ్స్ కేసులో విచారణా సరళిని ప్రభావితం చేసేలాగా ఈ మెహర్భానీ మెమోరాండాు పంపడం పరిశ్రమ వ్యక్తిత్వానికి తగని పని. అందుకే రాంగోపాల్‌వర్మ బహిరంగ లేఖకు అంత స్పందన.
ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ ఎందుకు ఏ పరిస్థితుల్లో ఆ లేఖ రాయవసి వచ్చిందో వివరణ ఇస్తే మంచిది. లేకపోతే ఆ లేఖలోని దీనాలాపన వెనుక అంతర్యాు వెతకవసివస్తుంది. ` ప్రభు