- Home
- News
- 'Kittu Unnadu Jagratha' Success Meet
'Kittu Unnadu Jagratha' Success Meet
08 Mar,2017
యంగ్ హీరో రాజ్‌తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందిన చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ను మార్చి 3న విడుదలై సూపర్‌హిట్ అయ్యింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో రాజ్ తరుణ్, దర్శకుడు వంశీకృష్ణ, రాజా రవీంద్ర, పృథ్వీ, స్నిగ్ధ, సుదర్శన్, ప్రవీణ్, స్నిగ్ధ, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ..
దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ - ``ఎగ్జామ్స్ టైంలో సినిమాను రిలీజ్ చేస్తున్నామని ఆలోచించాం..అయితే మేం అనుకున్న దానికన్నా మూడు రెట్లు ఎక్కువ విజయాన్ని ప్రేక్షకులు మాకు అందించారు. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సక్సెస్‌లో యూనిట్ ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. అనీల్ సుంకర, కిషోర్‌గారు మా కథను నమ్మి మాకెం కావాలో దాన్ని సమకూర్చారు. అనూప్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. పృథ్వీగారు రేచీ క్యారెక్టర్‌తో అలరించారు, రాజా రవీంద్రగారు సపోర్ట్‌ను మరచిపోలేను. రాజ్ తరుణ్ నేను ఏదీ చెబితే అది చేసుకుంటూ వచ్చాడు. రాజశేఖర్‌గారు ప్రతి విజువల్‌ను ఎంతో రిచ్‌గా చూపించారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
సమీర్ మాట్లాడుతూ - ``సినిమాలో సీరియస్ రోల్ చేశాను. డైరెక్టర్‌ను ఫస్ట్ టైం చూసి సీరియస్ పర్సన్ అనుకున్నాను. కానీ సినిమా చూసి సినిమాలోని ఎంటర్‌టైన్మెంట్‌కు ఫిదా అయిపోయాను. చిన్న చిన్న విషయాలను కూడా వదలకుండా కేర్ తీసుకున్నారు. రాజ్ తరుణ్ కాంబినేషన్‌లో సీన్స్ చేయలేదు. అనీల్ సుంకరగారు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇలా అందరూ తమ వంతు సపోర్ట్ చేశారు కాబట్టే సినిమా బాగా వచ్చింది. ఈరోజు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు`` అన్నారు.
ప్రవీణ్ మాట్లాడుతూ - ``సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తూ చేశాం. అనీల్‌గారు కథను నమ్మి మాకేం కావాలో అది ఇస్తూ వచ్చారు హిట్టు కొట్టాలి జాగ్రత్త అన్నారు. అయన అన్నట్లుగానే సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇక కిషోర్‌గారు అయితే ఖర్చు ఎక్కువైపోతుందనేవారు కానీ. ఖర్చుకు వెనుకడానివ్వలేదు. రాజ్‌తరుణ్ మరో సక్సెస్ కొట్టేశాడు. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
రాజా రవీంద్ర మాట్లాడుతూ - ``రాజ్‌తరుణ్‌కు కుక్కలంటే చాలా ఇష్టం. తను ఇంట్లో ఉన్నప్పుడంతా వాటితోనే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. అలాంటిది వాటితోనే సినిమా చేయాలనగానే, బాగా ఇన్‌వాల్వ్ అయిపోయాడనిపించింది. దర్శకుడు వంశీకృష్ణ పదిరోజుల్లోనే కథను, స్క్రిప్ట్‌ను తయారు చేసుకుని అద్భుతమైన సినిమాను తెరకెక్కించాడు. రేచీగా పృథ్వీ, ప్రవీణ్, స్నిగ్ధ, సుదర్శన్ అందరూ బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాలో నేను కూడా మంచి క్యారెక్టర్ చేశాను`` అన్నారు
పృథ్వీ మాట్లాడుతూ - ``వేసవిలో చల్లదనంలా కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా సక్సెస్ అయ్యింది. చాలా మంది ఈ సినిమా కుమారి 21 ఎఫ్ సినిమా రికార్డులను క్రాస్ చేస్తుందని అంటున్నారు. వంశీకృష్ణ పని రాక్షసుడు. మంచి అవుట్‌పుట్ రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. ప్రతి డైలాగ్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు`` అన్నారు.
రాజ్ తరుణ్ మాట్లాడుతూ - ``మంచి కథను ఇచ్చిన శ్రీకాంత్ విస్సాకు, కథను నమ్మి సినిమాను ప్రొడ్యూస్ చేసిన అనీల్ సుంకరగారికి, అలాగే కథను మంచి హిట్ సినిమాగా మలిచిన దర్శకుడు వంశీకృష్ణకు, ఇవన్నీ జరగడానికి కారణమైన రాజా రవీంద్రగారికి థాంక్స్. ప్రవీణ్, సుదర్శన్ క్యారెక్టర్స్, నా క్యారెక్టర్ మధ్య క్రియేట్ అయిన ర్యాపోతో మంచి కామెడి క్రియేట్ అయ్యింది. స్నిగ్ధ క్యారెక్టర్ కొద్దిసేపే అయినా అదరగొట్టేసింది. రేచీగా పృథ్వీగారు అందరికీ గుర్తుండిపోతారు. అనూప్ మంచి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. అను చక్కగా, గ్లామర్‌గా కనపడింది. రాజశేఖర్‌గారు ప్రతి సీన్‌ను చక్కగా చూపించారు. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో మరో హిట్ కొట్టడం ఆనందంగా ఉంది. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థాంక్స్`` అన్నారు.
Recent News