సెన్సార్ కి సిద్ధమైన రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్... జనవరిలో విడుదల
శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. విభిన్నమైన కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ నటించిన మరో ఇంట్రస్టింగ్ స్టోరీ ఇది. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... హౌరా బ్రిడ్జ్ అనే టైటిల్ పెట్టడం వెనక పెద్ద రీజన్ ఉంది. కానీ ఇప్పుడు రివీల్ చేయలేం. హ్యూమన్ రిలేషన్స్ కి ఈకథ బ్రిడ్జ్ గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాందినీ చౌదరి ఇందులో చాలా మంచి క్యారెక్టర్లో నటించింది. మనాలీ రాథోడ్ కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. దర్శకుడు రేవన్ చాలా క్లారిటీతో ఉన్నాడు. అధ్బుతమైన విజువల్స్ మిమ్మల్ని వండర్ చేస్తాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయింది. జనవరిలో గ్రాండ్ రిలీజ్ తో మీ ముందుకు వస్తున్నాం. నా కెరీర్లో అందరూ మెచ్చుకునే చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. అని అన్నారు.
దర్శకుడు రేవన్ మాట్లాడుతూ... ఇది నా రెండో ప్రాజెక్ట్. బూచమ్మ బూచోడు నాకు చాలా మంచి పేరు తెచ్చింది. రాహుల్ రవీంద్రన్ చాలా మంచి పెర్ ఫార్మర్. చాందిని చౌదరి, మనాలీ రాథోడ్ అటు అందం ఇటు అభినయంతో ఇంప్రెస్ చేస్తారు. ఇది బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ. అందుకే హౌరా బ్రిడ్జ్ అని పెట్టాం. కథలో అనేక ట్విస్టులుంటాయి. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో మెస్మరైజ్ చేయబోతున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చేదిగా ఉంటుంది. ఈ ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ సినిమాకు బాగా ఎస్సెట్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాం. జనవరిలో వరల్డ్ వైడ్ గా మా చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం. అని అన్నారు.
నటీనటులు
రాహుల్ రవీంద్రన్
చాందినీ చౌదరి
మనాలీ రాథోడ్
రావ్ రమేష్
అజయ్
ఆలీ
పోసాని కృష్ణ మురళి
ప్రభాస్ శ్రీను,
విద్యుల్లేఖ
జబర్దస్త్ రాకింగ్ రాకేష్ తదితరులు
టెక్నీషియన్స్
శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో
మ్యూజిక్ డైరెక్టర్ - శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్ - విజయ్ మిశ్రా
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు
పిఆర్ఓ - ఏలూరు శ్రీను
నిర్మాత - ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రేవన్ యాదు