23 Dec,2017

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ కోదండ‌రామిరెడ్డి చేతులు మీదుగా `స్టూడెంట్ పవ‌ర్` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

కృష్ణ‌, పూర్ణి హీరో, హీరోయిన్ల‌గా న‌టిస్తోన్న చిత్రం `స్టూడెంట్ ప‌వ‌ర్`. స‌త్యాసాయికృష్ణ క్రియేష‌న్స్ ప‌తాకంపై వి. కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. వి. రాజ్ క‌మ‌ల్ స‌మర్ప‌కుడు. గూన అప్పారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌వీణ్ ఇమ్మ‌డి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్క‌క‌ర‌ణ కార్య‌క్ర‌మం శ‌నివారం ఉద‌యం హైద‌రాబాద్ ఫిలిం చాంబ‌ర్ లో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిధిగా విచ్చేసిన సీనియర్ ద‌ర్శ‌కుడు కోదండ‌రామి రెడ్డి బిగి సీడీని ఆవిష్క‌రించారు. ల‌హ‌రి ఆడియో ద్వారా పాట‌లు మార్కెట్ లో కి వ‌చ్చాయి.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ` సినిమా పోస్ట‌ర్స్ బాగున్నాయి. టైటిల్ ప‌వ‌ర్ ఫుల్ గా ఉంది. పాట‌లు బాగున్నాయి. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు రావాలి. అలాగే శోభ‌న్ బాబు గారు, నేను మంచి స్నేహితులం. సినిమా ఇండ‌స్ర్టీలో బాబు అనే ట్రెండ్ శోభ‌న్ బాబుగారితోనే మొద‌లైంది` అని అన్నారు.

చిత్ర నిర్మాత వి.కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ, ` మ‌హేంద్ర వ‌ర్మ డిగ్రీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో  స్టూడెంట్ లీడ‌ర్ కి..అక్క‌డ లోక‌ల్ ఎమ్మెల్యేకి మ‌ధ్య జ‌రిగే పోరాట‌మే  ఈ క‌థ‌. ప్ర‌తీ స‌న్నివేశాన్ని ద‌ర్శ‌కుడు ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. యానాం, రాజ‌మండ్రి, పోల‌వ‌రం, ద్వార‌కా తిరుమ‌ల త‌దిత‌ర ప్రాంతాల్లో రెండు షెడ్యూల్లో షూటింగ్ పూర్తిచేసాం. కాశీ విశ్వ‌నాధ్  కాలేజ్ ప్రిన్స్ పాల్ పాత్ర‌లో, రిటైర్డ్ చీఫ్ ఇంజ‌నీర్ ఆర్. విద్యాసాగ‌ర‌రావు ( లేటు) కాలేజ్ క‌మిటీ చైర్మ‌న్ పాత్ర‌లో న‌టించారు. ఇందులో  5పాట‌లున్నాయి. చ‌క్క‌ని సాహిత్యానికి మంచి ట్యూన్స్ కుదిరాయి. పాట‌లు శ్రో త‌లంద‌రినీ మెప్పిస్తాయి. అన్ని ప‌నులు పూర్తిచేసి జ‌న‌వ‌రి మూడ‌వ వారంలో సినిమా రిలీజ్ చేస్తాం` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు గూన అప్పారావు మాట్లాడుతూ, ` ఓ ఊళ్లో దేవాల‌యం లాంటి కాలేజీని స్థానిక ఎమ్మెల్యే క‌బ్జా చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. ఈ నేప‌థ్యంలో ఆ కాలేజ్ ప్రిన్స్ పాల్... త‌మ స్టూడెంట్స్ తో క‌లిసి ఎలా కాపాడుకున్నారనే ఇతివృత్తంతో క‌థ సాగుతుంది. సినిమా బాగా వ‌చ్చింది. పాట‌లు, సినిమా పెద్ద విజయం సాధిస్తాయని ఆశిస్తున్నాం` అని అన్నారు.

ఈ వేడుక‌లో ద‌ర్శ‌కుడు వి.ఎన్ ఆదిత్య‌, స‌త్య‌ప్ర‌సాద్, రాంప్ర‌సాద్, సాకేత్ సాయి రాం, జ‌య‌కుమార్ త‌దితరులు పాల్గొన్నారు. 

ఇందులో జూనియ‌ర్ రేలంగి, చిట్టిబాబు, ఆకెళ్ల‌, శ్రీమ‌న్మ‌ధ‌, ఎమ్.జె కుమార్, ముత్యాల రాజు, స‌తీష్‌, శ్రీవ‌ల్లి, జూ..శోభ‌న్ బాబు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా:  డి.విరాజు, క‌ళ‌:  విజయ్ కృష్ణ‌,   Hello

 

Recent News