హలో చిత్రం డిసెంబర్ 22 న విడుదల కానున్న సందర్భంగా కింగ్ నాగార్జున మీడియా తో ప్రత్యేక ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ హలో చిత్రం కోసం తాను కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని సినిమా ప్రొమోషన్ కోసం usa వెళ్లి రాగానే ప్రీ - రిలీజ్ ఫంక్షన్, బిజీ షెడ్యూల్ తో అఖిల్ బాగా అలిసి పోయాడని అందుకే ప్రెస్ మీట్ కు రాలేక పోయాడని చెప్పారు.
ప్ర:- సినిమా గురించి ప్రత్యేకంగా ఎదైనా చెప్పాలనుకుంటున్నారా?
జ:- ముందుగా ఈ సినిమా డైరెక్టర్ విక్రం గారికి thanks చెప్పాలి. విక్రం మరియు వాళ్ళ team,సుప్రియ,ఎడిటర్ ప్రవీణ్ పూడి, మిగిలిన team అంతా కూడా మనసు పెట్టి ఈ సినిమా చేశారు. ఎలాగైనా ఈ సినిమా హిట్ చేయాలన్న కసితో వాళ్ళంతా పని చేసారు. ఈ సినిమా కోసం 100 % efforts పెట్టి చేసాం. రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను.
ప్ర:- బడ్జెట్ అంచనాలు భారీగా పెరిగాయి అంటున్నారు నిజామేనా ?
జ : నాకు సినిమా అంటే ప్రాణం. కథ అవసరాన్ని బట్టి ఎంత బడ్జెట్ అవసరమో అంత ఖర్చు చేస్తాను.క్వాలిటి కోసం తప్పదు ఇంతకు ముందు మా బ్యానర్ లో చాలా సినిమాలు వచ్చాయి అప్పుడు ఈ ప్రశ్న అడగలేదు. అఖిల్ ను హీరోగా ప్రోమోట్ చేస్తున్నాను కాబట్టి బడ్జెట్ విషయంలో రిస్క్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాను. అఖిల్ కూడా ఒకసారి దెబ్బతిన్నాడు. మళ్ళి లేచి నిలబడ్డాడు. అతని కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది.
ప్ర:- సినిమాలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగానే ఉంది అని టాక్ ?
జ : లేదండి. సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ఒకసారి ఫైనల్ అయిన తర్వాత నా జోక్యం ఉండదు. మనం సినిమా తర్వాత విక్రం కూడా ఈ సినిమా కు బాగా కష్టపడి చేస్తున్నాడు. కాకపొతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అంటే నాకు చాలా ఇష్టం. కాబట్టి టెక్నిషియన్స్ కు కావలసిన టైం ఇస్తూనే ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. అందుకే నేను దగ్గరుండి అందరిని మోటివేట్ చేస్తున్నాను.
ప్ర:- చిరంజీవి గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చారు కదా? మెగా ఫ్యాన్స్ ను కూడా సినిమా ప్రోమోట్ కు వాడుకున్నారా?
జ : చిరంజీవి గారిని నేనే దగ్గరుండి ఇన్వైట్ చేశాను. సినిమా చూసి నచ్చితేనే ప్రి రిలీజ్ ఫంక్షన్ కు రావాలని అడిగాను. చిరంజీవి గారు కూడా సినిమా చూసి 2 నిమిషాలు అఖిల్ ని హత్తుకుని బెస్ట్ విషెస్ చెప్పారు. అది చూశాక నేను పూర్తిగా రిలాక్స్ గా ఫీల్ ఐయ్యాను. రాం చరణ్ అఖిల్ కు బెస్ట్ ఫ్రెండ్ అందుకే అతను కూడా వచ్చి సపోర్ట్ చేసాడు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా మాకు సపోర్ట్ చేయటం హ్యాపీ గా ఉంది. ఇక సినిమా బాగుంటే అందరి ఫ్యాన్స్ కూడా వస్తారు.
ప్ర:- రమ్యకృష్ణ , జగపతి బాబు కాంబినేషన్ గురించి ?
జ : రమ్యకృష్ణ ను నేనే అడిగాను అఖిల్ కు మదర్ గా యాక్ట్ చేయమని. అడిగిన వెంటనే తను ఒప్పుకోవడం హ్యాపీ గా ఉంది. ఇక జగపతి బాబు ఈ మద్య నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ వేస్తున్నాడు. కాని ఇందులో ఇద్దరు కూడా ఒక డిఫరెంట్ రోల్ లో కనిపిస్తారు.
ప్ర:- సార్ సినిమా గురించి ఫైనల్ గా మీరు ఏమి చెప్పదలచుకున్నారు?
జ : ముందే చెప్పినట్టు మా టీం అంతా కూడా 100 % మనసు పెట్టి చేసిన సినిమా ఇది. క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్ విక్రం కే చెందుతుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్ ను తీసుకుని అఖిల్ బాడీ లాంగ్వేజెస్ కు తగ్గట్టు స్టోరీ డిజైన్ చేసాడు. ఇండియన్ స్క్రీన్ మీద ఇంతవరకు చూడని స్టంట్స్ మీరు చూస్తారు.
మా తరపున మేం చేయాల్సింది చేసాం. రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంది. అయితే ఈ సినిమా అఖిల్ ని హీరోగా నిలబెట్టే సినిమా అవుతుంది అని ఖచ్చితంగా చెప్పగలను.