Who Is Lead in Srinivasa Kalyanam...?

22 Feb,2017

దిల్ రాజు సంక్రాంతికి శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాన్నిరిలీజ్ చేసి ఘ‌న విజయం సొంతం చేసుకున్నారు. గ‌తంలో కూడా సంక్రాంతికి సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రాన్ని రిలీజ్ చేసి విజ‌యం సాధించారు. దీంతో దిల్ రాజు వచ్చే సంక్రాంతికి కూడా ఓ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి  శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ వేగేశ్న స‌తీషే ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ఈ సినిమా కోసం శ్రీనివాస క‌ళ్యాణం అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేసార‌ట. అయితే...దిల్ రాజు ఈ చిత్రాన్ని నాగార్జున‌తో చేయాల‌నుకుంటున్నార‌ని తెలిసింది. నాగార్జున ప్ర‌స్తుతం రాజు గారి గ‌ది 2 లో న‌టిస్తున్నారు. ఆత‌ర్వాత చేసే సినిమాల గురించి క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి కానీ ఇంకా ఏ సినిమాని ఫైన‌ల్ చేయ‌లేదు. మ‌రి...దిల్ రాజు అనుకున్న‌ట్టు జ‌రిగితే నాగార్జున‌తో శ్రీనివాస క‌ళ్యాణం ఉండ‌చ్చు. 

Recent News