ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలతో వరుస విజయాలు సాధించి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక అసలు విషయానికి వస్తే...తమిళ్ లో ధృవంగల్ పదినారు చిత్రంతో సక్సెస్ సాధించిన దర్శకుడు కార్తీక్ నరేన్ చైతన్యకు ఓ కథ చెప్పాడట. ఈ కథ నచ్చడంతో చైతన్య ఈ సినిమా చేసేందుకు అంగీకరించాడని సమాచారం. అరవింద్ స్వామి ప్రధాన పాత్ర పోషించనున్న ఈ సినిమాలో మలయాళ యువ హీరో కూడా నటించనున్నాడట. తెలుగు, తమిళ, మలయాళ హీరోలు కలిసి నటించనున్న ఈ సినిమాని మూడు భాషల్లో ఒకేసారి నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఇప్పటి వరకు టాలీవుడ్ కే పరిమితమైన చైతన్య ఇప్పుడు కోలీవుడ్ పై కూడా దృష్టి పెడుతుండడం విశేషం.