రమణ శ్రీ గుమ్మకొండ, గీతా మన్నం సమర్పణలో రమణ శ్రీ ఆర్ట్స్ బేనర్‌పై కార్తీకేయ, సిమ్రత్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `ప్రేమతో మీ కార్తీక్`. రిషి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రవీందర్ ఆర్.గుమ్మకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సాంగ్ రిలీజ్ కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెస్ట్ సక్సస్‌పుల్ నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సక్స్‌స్ ఫుల్ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``ఈ చిత్ర కథ నాకు తెలుసు ఈ సాంగ్ చూస్తుంటే, సాంగ్ చిత్రీకరించిన విధానం, సాహిత్యం అంతా బావుంది. మంచి ఫీల్ వున్న ప్రేమకథాచిత్రమిదని తెలుస్తుంది. ఈ చిత్రం త్వరలో మా ద్వారా విడుదలవుంతుంది. ఇలాగే అందరినీ మెప్పించేలా ఉండాలని కోరుకుంటూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
మైత్రిమూవీస్ నవీన్ ఎర్నేని మాట్లాడుతూ - `నిర్మాత రవీందర్‌గారు నాకు యు.ఎస్‌లో బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన అన్న తనయుడితో చేసిన సినిమా ఇది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
దర్శకుడు రిషి మాట్లాడుతూ - `` మెస్ట్ సక్సస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు గారు వారి అమూల్యమైన కాలాన్ని మా కోసం వెచ్చించి ఈ ఫంక్షన్ ని రావటమే మా మెదటి సక్సస్ గా భావిస్తున్నాము. మా లాంటి చిన్న చిత్రానికి ఆయన అండ దొరకడం మా అదృష్టం. వారికి మా మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటుంన్నాను. అలాగే ఈ సినిమాను జనతాగ్యారేజ్ సెట్‌లో చిత్రీకరించాం. అడగ్గానే ఆ సెట్‌ను నవీన్‌గారు మాకు ఇచ్చారు. ఆయనకు థాంక్స్. సినిమా బాగా తీశాననే అనుకుంటున్నాను. సినిమా తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది. సినిమా క్లీన్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్`` అన్నారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ - ``మా సినిమా సాంగ్‌ను విడుదల చేసిన దిల్‌రాజుగారికి థాంక్స్. ఫెయిల్యూర్ నుండి సక్స్ ఎలా సాధించాలో దిల్ రాజు గారి కెరీర్ ని ఇన్స్పైర్ గా తీసుకోవాలి. నాకు తెలిసి ఓ కామన్ ఆడియన్ హీరో ని చూసి దర్శకుడిని చూసి సినిమాకి వెలతారు. కాని ప్రోడ్యూసర్ దిల్ రాజు గారి పేరు చూసి సినిమా కి వెల్లటం అనేది ఇప్పడు ట్రెండ్. అలాంటి దిల్ రాజు గారి ద్వారా సినిమా చేశామని అనుకుంటున్నాను. నిర్మాతగారు మా బాబాయ్. నా కోసం సినిమా చేశారు. సినిమా అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన రవీందర్ ఆర్ గుమ్మడికొండ మాట్లాడుతూ - ``మా అన్నయ్య తనయుడు కార్తీక్ , పూణే ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ట్రయినింగ్ తీసుకుని ఒకట్రెండు షార్ట్ మూవీస్‌లో నటించాడు. మా కార్తీక్‌కు సెకండ్ హీరో, చిన్న క్యారెక్టర్స్ ఇస్తామని అవకాశాలు వచ్చాయి. అయితే అందుకు నేను ఒప్పుకోకుండా నేనే నిర్మాతగా మారి ఈ సినిమా చేశాను. దర్శకుడు రిషితో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయమని అన్నాను. రిషి మంచి కథతో నా వద్దకు వచ్చాడు. కథ నచ్చడంతో ఈ సినిమా చేశాం`` అన్నారు.
నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మడికొండ మాట్లాడుతూ.. ఆ చిత్రం సాంగ్ రిలీజ్ కి విచ్చేసిన దిల్ రాజు గారికి, మైత్రిమూవీస్ నవీన్ గారికి మా యూనిట్ తరుపున హ్రుదయపూర్వక ధన్యవాదాలు. మా దర్శకుడు రిషి ని ఈ సాంగ్ రిలీజ్ చేద్దామని అడిగాము. ఆయన కొంచెం టైం తీసుకున్నారు. టైం తీసుకున్నా ఇలాంటి అద్బుతమైన సాంగ్ ని ఇచ్చినందుకు వారికి మా ధన్యవాదాలు. చిత్రం మెత్తం ఇంతకు మించే వుంటుంది. మా అన్నయ్య గారి అబ్బాయ్ కార్తిక్ హీరో గా చేస్తున్నాడు. మాకు అన్నివిధాల సహకరిస్తున్న మీడియా వారికి మా ధన్యవాదాలు. ఈ చిత్రం దిల్ రాజు గారి ద్వారా విడుదల కావటం మాలాంటి మంచి చిత్రాలకు కొండంత ధైర్యం అనే చెప్పాలి. ప్రత్యఖంగా దిల్ రాజు గారికి మా ధన్యవాదాలు. అలాగే అతి త్వరలో చిత్రం యెక్క టీజర్ ని లాంచ్ చేస్తాము. ఈ నెలలోనే చిత్రం విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము. అని అన్నారు
కార్తికేయ,సిమ్రత్, గొల్లపూడి మారుతీరావు, సుమిత్ర, మురళీశర్మ, పృథ్వీ, ప్రగతి, ఝాన్సీ, దువ్వాసి, కారుమంచి రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి
సాహిత్యంః శ్రీమణి, ఎడిటర్ః మధు, ఆర్ట్ః హరివర్మ, సినిమాటోగ్రఫీః సాయిప్రకాష్ ఉమ్మడిసింగు, సంగీతంః షాన్ రెహమాన్, లైన్ ప్రొడ్యూసర్ః అశోక్‌రెడ్డి గుమ్మడికొండ, నిర్మాతః రవీందర్ ఆర్.గుమ్మడికొండ, రచన, దర్శకత్వంః రిషి.