ఓ వైపు పన్నీర్ సెల్వం, మరో వైపు శశికళ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉంటూ సస్పెన్స్ ధ్రిల్లర్ లా ఉత్కంఠ కలిగిస్తున్న తమిళ రాజకీయాల్లో మరో ఇంట్రస్టింగ్ న్యూస్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం.
గత కొన్ని సంవత్సరాలుగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై ఎప్పుడు రజనీకాంత్ ని అడిగినా...టైమ్ వచ్చినప్పుడు అదే జరుగుతుంది అనే సమాధానం చెప్పేవారు.
అయితే...ఆర్.ఎస్.ఎస్ కు చెందిన సీనియర్ నేత ఎస్.గురుమూర్తి రజనీకాంత్ ని పార్టీ పెట్టమని సలహా ఇవ్వడం..ఇటీవల రజనీకాంత్ ని గురుమూర్తి కలవడంతో రజనీ రాజకీయాల్లోకి రావడం ఖాయం అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
తమిళనాడులో జయలలిత చనిపోయిన తర్వాత ఏర్పడిన పరిస్ధితుల దృష్ట్యా ఇదే సరైన సమయంగా భావించి రజనీ రాజకీయ ప్రవేశం చేస్తారా..? ఒకవేళ రాజకీయ ప్రవేశం చేస్తే... ఏ పార్టీలో అయినా చేరతారా..? లేక రజనీకాంతే సొంతంగా పార్టీ పెడతారా..? అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..!