04 Sep,2017

సక్సెస్ ఫుల్దర్శకుడు బోయపాటి శ్రీను విడుదల చేసిన
"ఇంతలో ఎన్నెన్ని వింతలో" టీజర్
 
నందు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇంతలో ఎన్నెన్ని వింతలో. హరిహర చలన చిత్ర సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మాతలు. వరప్రసాద్ వరికూటి దర్శకత్వం వహిస్తున్నారు. సౌమ్య వేణుగోపాల్ నాయికగా పూజ రామచంద్రన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఆదివారం నందు పుట్టిన రోజు సందర్భంగా ఇంతలో ఎన్నెన్ని వింతలో చిత్ర టీజర్ ను దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ విడుదల చేశారు. అనంతరం బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ...నందు నటుడిగా ఆల్ రౌండర్. ఏ తరహా పాత్రలోనైనా నటించగలడు. దర్శకుడు ఎలా కోరుకుంటే అలా కనిపించగలడు. అలాంటి నటుడిని నందులో చూశాను. ఆయన నటించిన సినిమాలు బాగుండాలి. ఇదొక్కటే కాదు ముందు ముందు నటించే చిత్రాలు కూడా హిట్ అవ్వాలి. వాటిలో ఇంతలో ఎన్నెన్ని వింతలో ముందుండాలి అని కోరుకుంటున్నాను. యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు. హీరో నందు మాట్లాడుతూ...బోయపాటి గారు నాకు దేవుడిచ్చిన అన్నయ్య లాంటి వారు. నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. ఇటీవలే ఆయన సినిమా జయ జానకి నాయకలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ పాత్రతో నాకు బాగా గుర్తింపు దక్కింది. ఇవాళ నా సినిమా ఇంతలో ఎన్నెన్ని వింతలో టీజర్ విడుదల చేశారు. మొత్తం యూనిట్ తరుపున, మా కుటుంబ సభ్యుల తరుపున బోయపాటి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. టీజర్ మీకు నచ్చుతుంది. మంచి కథాంశంతో ఇంతలో ఎన్నెన్ని వింతలో తెరకెక్కింది. త్వరలో ట్రైలర్ తో మీ ముందుకొస్తాం. అన్నారు. నిర్మాత ఇప్పిలి రామమోహన్ రావు మాట్లాడుతూ...హరిహర చలన చిత్ర పతాకంపై ఇంతలో ఎన్నెన్ని వింతలో చిత్రాన్ని నిర్మించాం. బోయపాటి గారు మేం అడగ్గానే వచ్చి టీజర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. సినిమా ఉత్కంఠభరితమైన కథనంతో విభిన్నంగా ఉంటుంది. అక్టోబర్ లో సినిమాను తెరపైకి తీసుకొస్తాం అన్నారు.
 
పూజా రామచంద్రన్, నల్లవేణు, దువ్వాసి మోహన్, నరసింహా, కృష్ణ తేజ, త్రిశూల్, గగన్ విహారి, రమేష్, భార్గవ్, కిషోర్ దాస్, సత్తన్న, దుర్గారావు, మీనా వాసుదేవ్, కౌశిక్, పద్మ జయంతి, సోనక్షీ వర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత - డి.శ్రీనివాస్ ఓంకార్, కెమెరామెన్ - ఎస్ మురళీ మోహన్ రెడ్డి, ఎడిటింగ్ - ఛోటా కె ప్రసాద్, సంగీతం - యాజమాన్య, ఆర్ట్ - జిల్ల మోహన్, స్టంట్స్ - మర్సాల్ రమణ, కొరియోగ్రఫీ - విఘ్నేశ్వర్, సాహిత్యం - సురేష్ గంగుల, కో  డైరక్టర్ - రామ్ ప్రసాద్ గొల్ల, రచనా సహకారం, శివ యుద్ధనపూడి

Recent News