కొబ్బరికాయ కొట్టాక పీచు ఎందుకు తీస్తారు?

13 Sep,2017

                         కొబ్బరికాయ కొట్టాక పీచు ఎందుకు తీస్తారు? 
కొబ్బరికాయకు పీచు క్రిందిభాగంలో మూడు కళ్లున్న ప్రదేశం సున్నితంగా ఉంటుంది. అక్కడ గట్టిగా నొక్కితే నీళ్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొబ్బరిపీచును పూర్తిగా తీసినట్లయితే నీళ్లు కారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే కళ్లున్న వైపు పికలా పీచును విడిచిపెడతారు.అందుకే పికతో ఉన్న కొబ్బరికాయను పగలకొట్టి, ఆ పైన పిక తీసివేసి నివేదిస్తాం. అదేవిధంగా ఏ పండునైనా కొద్దిగా ఒలిచి భగవంతునికి నివేదించడం మన సంప్రదాయం. 

                              పూజలో కొబ్బరియ కుళ్లితే దోషమా?
 కొబ్బరికాయ కుళ్లిపోవడం దోషం కాదు. మరో కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. వాహనాలకు దిష్ట తీసేందుకు కొట్టిన కాయ విషయంలో కూడా ఆ విధంగానే చేయాలి. అంతేకానీ, అది దోషం అని భావించి బాధపడకూడదు. కొబ్బరికాయ సమంగా పగడం మంచిదని, పుప్వువస్తే అదృష్టమని, కుళ్లిపోతే శుభమని కొందరు చెబుతారు.

Recent Stories

LATEST NEWS

ACTRESS GALLERY