బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా కారణంగా ఊపందుకున్న ‘మీటూ’ ఉద్యమంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు మహిళలు ఇప్పటివరకూ దాగివున్న విషయాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. తాజాగా నటి షర్లన్‌చోప్రా బాలీవుడ్‌లో డిన్నర్‌కి గల అర్థాన్ని చెప్పారు. ఎప్పుడూ బోల్డ్ ఫొటోలతో కనిపించే ఈమె ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో బాలీవుడ్‌లో డిన్నర్‌కి పిలిచారంటే దాని అర్థమేమిటో వివరించారు. బాలీవుడ్‌కి చెందిన నిర్మాతలు, లేదా దర్శకులు అప్పుడప్పుడు నటీమణులను డిన్నర్‌కు పిలుస్తుంటారు. అప్పుడు దానిని డిన్నర్‌కు మాత్రమే కాదని అర్థం చేసుకోవాలన్నారు. దానిని సెక్సువల్ ఫేవర్ కోసమని గ్రహించాలి. తాను అవకాశాల కోసం నిర్మాత, లేదా దర్శకులు దగ్గరకు వెళ్లినపుడు వారు రాత్రి డిన్నర్‌కు వారి ఆఫీసుకు పిలిచేవారు. మొదట్లో అనుమానం కలిగేదని, తరువాత మెల్లమెల్లగా అర్థమయ్యిందని అన్నారు. దీంతో అప్పటి నుంచి ప్రతిభ కలిగిన నిర్మాత, దర్శకులనే కలుసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అయితే చిన్నచిన్న పట్టణాల నుంచి వచ్చినవారికే ఇటువంటి అనుభవాలు ఎక్కువగా ఎదురవుతాయని షర్లిన్ చోప్రా చెప్పారు.షర్లిన్ తెలుగులో ‘వెండి మబ్బు’, ఏ ఫిల్మ్ బై అరవింద్’, ‘సమ్‌థింగ్ స్పెషల్’ చిత్రాలలో నటించారు.