డేటింగ్ కి ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట

02 Mar,2019

తెలుగులో  హీరోయిన్ గా ప్రయత్నించి సక్సెస్ రాకపోవడంతో బాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాలు చేస్తూ అక్కడ సెటిల్ అయిన ముద్దుగుమ్మ కృతి సనన్. ఈ అమ్మడు బాలీవుడ్ లో మెల్ల మెల్లగా మంచి ఆఫర్లే దక్కించుకుంటుంది. తాజాగా అమ్మడు 'లుకా ఛుపీ' చిత్రంలో నటించింది. ఈ చిత్రం కథ మొత్తం కూడా లివింగ్ రిలేషన్ షిప్ పై నడుస్తుందట. లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న జంట ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటీ వారిని సమాజం ఎలా చూస్తుందనే విషయాన్ని సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో కృతి సనన్ ఒక మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను లివింగ్ రిలేషన్ షిప్ గురించి చెప్తే తన కుటుంబ సభ్యులు ఒప్పుకోరు అని భావించాను. కాని ఒకానొక సమయంలో అమ్మతో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉండగా ఆమె నువ్వు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒకవేళ నీకు నచ్చిన వాడు అయితే ప్రొసీడ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయంలో మాత్రం నాన్న ఇంకా ఎలాంటి స్పందన చెప్పలేదు. ఆయన తన లుకా ఛుపీ సినిమా చూసిన తర్వాత లివింగ్ రిలేషన్ షిప్ కు ఓకే చెప్తారేమో చూడాలని కృతి సనన్ చెప్పుకొచ్చింది. మరి ఈమె ఎవరితో లివింగ్ రిలేషన్ షిప్ ను మెయింటెన్ చేయబోతుందో చూడాలి.

Recent Gossips