ప్రేమ విషయంలో మై బ్యాడ్ లక్ అని అంటుంది ఈ మద్యే తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకుంటున్న ఐశ్వర్యా రాజేష్ ? కోలీవుడ్‌లో అత్యధిక చిత్రాలు చేస్తున్న నటి ఎవరైనా ఉన్నారంటే అది ఐశ్వర్యే కావడం విశేషం. నటిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన కథానాయకి ఈమె. ఈ అచ్చ తెలుగు భామ తమిళంలో ప్రముఖ కథానాయకిగా రాణించడం విశేషమే. ఇటీవలే మాతృభాషలోకి ఎంటర్ అయిన ఐశ్యర్యరాజేశ్ చిన్న వయసులోనే అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పించి కథానాయకి స్థాయికి ఎదిగింది. ఇటీవల నటించిన కనా చిత్రంలో సెంట్రిక్ కథాపాత్రలో నటించి ప్రశంసలు అందుకున్న ఐశ్వర్యరాజేశ్ ప్రేమలో ఓడిపోయానని చెప్పింది. అంతే కాదు ఆ విషయంలో తాను దురదృష్టవంతురాలినని పేర్కొంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ప్రేమ, సినిమా, మగాళ్ల గురించి మాట్లాడుతూ తాను ఇప్పటికీ సింగిల్‌నేనని తెలిపింది. ప్లస్‌టూ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డానని చెప్పింది. అయితే అది మొదట్లోనే ముగిసిపోయిందని అంది. తాను ప్రేమించిన యువకుడిని తన స్నేహితురాలే తన్నుకుపోయి తనను మోసం చేసిందని చెప్పింది. ఆ తరువాత కొన్నేళ్లకు మరోసారి ప్రేమలో పడ్డానని, అప్పుడూ తాము విడిపోవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ప్రేమిస్తే అది కలకాలం సాగాలని భావించే అమ్మాయిని తానని అంది. కొందరు కొంత కాలం ప్రేమించుకుని బ్రేకప్ అయిన వెంటనే మరొకరిని ప్రేమిస్తుంటారని, అది ఎలా సాధ్యమో తనకు అర్థం కావడం లేదని పేర్కొంది.