తెలుగు తమిళ ప్రేక్షకులకు హీరోయిన్ రెజినా కసాండ్రా అందరికి తెలుసు. తెలుగులో చాలా సినిమాలే చేసింది అయినా ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కలేదు. తెలుగులో ఈమధ్య సినిమాలు తగ్గడంతో తమిళంపై ఫోకస్ చేస్తున్న ఈ చెన్నై బ్యూటీ రీసెంట్ గా సోనమ్ కపూర్ సినిమా 'ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లగా' తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. లెస్బియన్ లవ్ కథాంశంతో తెరకెక్కిన ఈ బోల్డ్ సినిమాలో సోనమ్ కపూర్ లవర్ గా రెజినా నటించింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రెజీనాతో రొమాన్స్ చేయడం గురించి సోనమ్ షాకిచ్చే కామెంట్లు చేసింది. "రెజీనా ఒక కూల్ అమ్మాయి .. ఓ మంచి నటి.. వీటన్నిటికంటే మించి రెజీనా దగ్గర ఎప్పుడు పరిమళం ఉంటుంది. అందుకే రెజీనా తో రొమాన్స్ చేయడం బాగుంటుంది. నేను హ్యాపీ" అని చెప్పుకొచ్చింది. ఎంతమరీ అమ్మాయి అయితే మాత్రం ఇలా డైరెక్ట్ గా చెప్తే ఎలా అంటూ అందరు షాక్ అవుతున్నారు. సోనమ్ అంతటితో ఆగకుండా "సినిమాల్లో లీడ్ యాక్టర్ ను మేము ప్రేమించాల్సి వస్తుంది. నిజానికి మేము వారిని ప్రేమించం. సో.. అంతా నటనే." అంటూ రొమాన్స్ సంగతి కాస్త కవర్ చేసింది.