తెలుగులో 'ఫిదా' చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవికి మంచి డిమాండ్ ఉంది సౌత్ లో. ఆచి తూచి సినిమాలకు కమిట్ అవుతుంది. ప్రస్తుతం ఈమె దృష్టి ఎక్కువగా తమిళ సినిమాలపై ఉన్నట్లుండి. ఇక్కడ ఒక్కటి చేస్తే అక్కడ రెండు చేస్తోంది. వరుస చిత్రాలతో చాలా బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను పెళ్లి చేసుకోను అంటూ తేల్చి చెప్పింది. పెళ్లి చేసుకోకుండా ఉండి జీవితాంతం తల్లిదండ్రులకు తోడుగా ఉంటాను అంటోంది. పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులను విడిచి ఉండాల్సి వస్తుందేమో అనే భయంతోనే తాను పెళ్లికి నో అంటోందట. పెళ్లి చేసుకుంటే నేను నా తల్లిదండ్రుల సంరక్షణ పూర్తిగా చూసుకోలేనేమో అనే భయం ఉంది. నాకు అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం మాది అత్యంత సంతోషకరమైన ఫ్యామిలీ మా సంతోషకరమైన ఫ్యామిలీలో మరొకరు దూరడం నాకు ఇష్టం లేదు. కొత్తగా వచ్చే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో అతడి వల్ల నా తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారో లేదో అనే అనుమానం నాకు ఉందని అందుకే పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చింది. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం మంచి పద్దతే మంచి నిర్ణయమే కాని అందుకోసం పెళ్లి వద్దనుకోవడం ఏంటీ అని అందరు అనుకుంటున్నారు.