తమిళ అర్జున్ రెడ్డి ఆగిపోయిందా

08 Feb,2019

అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. కేతక్కువ బడ్జెట్ తీసిన ఈ సినిమా ఏకంగా 25 కోట్లకు పైగా వసూలు చేసి దుమ్ము రేపింది. దాంతో ఈ సినిమా హక్కులను పలు బాషల వాళ్ల్లు  రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడం అప్పుడే షూటింగ్ కూడా మొదలు పెట్టడం జరిగిపోయాయి. తమిళంలో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా జాతీయ దర్శకుడు బాల దర్శకత్వంలో వర్మ పేరుతొ ఈ సినిమా మొదలు పెట్టారు.  ఇటీవలే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. అయితే   సినిమా అవుట్ పుట్ తమకి నచ్చలేదనీ, అందువలన దానిని పక్కన పెట్టేస్తున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. ధృవ్ హీరోగా వేరే దర్శకుడితో ఈ సినిమాను నిర్మించనున్నట్టు చెప్పారు. అయితే ఈ సినిమా ఆగిపోవడానికి కారకుడు విక్రమ్ అనే మాట కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. అవుట్ పుట్ విక్రమ్ కి ఎంత మాత్రం నచ్చలేదట. ఈ సినిమా విడుదలైతే .. తన కొడుకు కెరియర్ ఇబ్బందుల్లో పడుతుందని భావించి ఆపేయమన్నాడట.  అది విషయం. 

Recent Gossips