చేతులు కాలాకా ఆకులూ పట్టుకున్నట్టు ఉంది కొందరు హీరోయిన్స్ పరిస్థితి. చేతిలో సినిమాలు ఉన్నప్పుడు .. నేను ఇలాగె ఉంటాను , గ్లామర్ పాత్రలకు దూరం అంటూ నానా రచ్చ చేసే భామలు .. ఆ తరువాత అవకాశాలు పోయాక .. .. ఇప్పుడు బికినీలు కూడా వేస్తాను అంటే ఏమి లాభం చెప్పండి .. ఇప్పుడు అలాగే ఉంది తెలుగు భామ కలర్స్ స్వాతి పరిస్థితి ? పెళ్లి తర్వాత.. సినిమాల్లో నటించడానికి సిద్ధమే అని అంటోంది స్వాతి. ఈ విషయంలో తన భర్తకు ఏ మాత్రం అభ్యంతరం లేదు అని.. “నీ తర్వాతి సినిమా ఎప్పుడు..’’అంటూ తన భర్త వికాస్ అడుగుతున్నాడని చెబుతోంది. ఒ టీవీ షో ద్వారా పాపులర్ అయ్యి, ఆపై సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించుకున్న స్వాతి ఈ మద్యే పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మళ్లీ సినిమాల మీద గాలి మళ్లిందో ఏమో కానీ... తాజా ఇంటర్వ్యూల్లో సినిమాలకు ఓకే అని చెబుతోంది. పెళ్లి తర్వాత చాలా మంది నటీమణులు సినిమాలు మానేయడం మామూలే. అయితే తనకు మాత్రం అలాంటి పరిమితులు లేవని స్వాతి అంటోంది. పైపెచ్చూ పెళ్లి తర్వాత తనకు కొత్త స్వతంత్రం వచ్చిందని కూడా అంటోంది. ఇటీవల స్విమ్ సూట్లో తన ఫొటోలను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు అని.. తన భర్తకు ఏమీ ఆశ్చర్యం కలగలేదని స్వాతి అంటోంది. తను చిన్నప్పటి నుంచి స్విమ్ చేస్తున్నాను అని.. ఎప్పుడైనా స్విమ్ సూట్ తోనే స్విమ్ చేస్తాం కదా..అంటుంది. ఒకవేళ అప్పుడే ఎవరైనా డైరెక్టర్స్ అడిగి ఉంటె .. అప్పుడే చేసేదాన్ని అని కూడా స్వాతి చెప్పడం విశేషం. మొత్తానికి కలర్స్ స్వాతి ఫోకస్ మళ్ళి సినిమాల పై పడ్డట్టుంది.