30 Dec,2018

ఇదం జగత్ రివ్యూ 

సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి
నిర్మాత: గంగపట్నం శ్రీధర్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: అనిల్ శ్రీకాంతం
నటీనటులు: సుమంత్ - అంజు కురియన్ - సత్య - ఆదిత్య మీనన్ - శివాజీ రాజా - రామ్ తదితరులు
విడుదల : 28-12-2018
రేటింగ్ : 2 / 5

ఈ మద్యే కాస్త భిన్నమైన సినిమాలతో మళ్ళీ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అక్కినేని ఫ్యామిలి హీరో సుమంత్. దాదాపు నాలుగేళ్ళ గ్యాప్ తరువాత థ్రిల్లింగ్ కథలతో వస్తున్నా అయన తాజాగా సుబ్రమణ్యపురం అంటూ కొత్త ప్రయోగం చేసాడు. తాజాగా 
‘ఇదం జగత్’ అనే మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు అనిల్ శ్రీకాంతం రూపొందించిన ఈ చిత్రం కథేమిటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..  

కథ:

నిషిత్ (సుమంత్) చదువు పూర్తి చేసి.. సరైన ఉద్యోగం కోసం ట్రై చేసి విసిగిపోయిన కుర్రాడు .. ఎలాగైనా సరే   డబ్బు సంపాదించడం కోసం సంపాదించాలని నైట్ రిపోర్టర్ గా మారతాడు. రాత్రిళ్లు జరిగే సంఘటలను షూట్ చేసిఆ ఫుటేజ్ ను ఛానెల్ కు అమ్ముకుని డబ్బు సంపాదిస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్ మహతి (అంజు కురియన్) వాళ్ల నాన్న హత్యా చేయబడుతాడు. ఈ హత్యా ను సుమంత్ రికార్డుచేస్తాడు దాన్ని భారీ మొత్తంలో క్యాష్ చేసుకోవాలనుకుంటాడు. మరి సుమంత్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా ? ఆ హత్యా ను ఎవరుచేశారు ? ఈ పని వల్లే అతను చిక్కుల్లో పడతాడు. ఆ చిక్కులేంటి.. వాటిని అతను ఎలా ఛేదించాడు అన్నది మిగతా కథ.  

నటీనటుల ప్రతిభ : 

సవాలు తో కూడుకున్న పాత్ర కాకపోవడంతో పెద్దగా హీరో కష్టపడ్డట్లు అనిపించదు. ఉన్నంతలో సుమంత్ బాగానే చేసాడు. అతడి ప్రత్యేకత ఏమీ కనిపించదు.ఇక   హీరోయిన్ అంజు కురియన్ తన పాత్ర పరిధి మేర నటించింది. కాకపోతే గ్లామర్ పరంగా అంతగా మెప్పించలేకపోయింది. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన సత్య అలాగే పోలీస్ ఆఫీసర్ గా నటించిన శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు. నెగిటివ్ రోల్ లో నటించిన అర్జున్ రెడ్డి ఫేమ్ కళ్యాణ్ మంచి నటన కనబరిచాడు. తన ఆటిట్యూడ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.  షఫి పాత్ర వ్యర్థంగా సాగుతుంది.

సాంకేతికవర్గం: 

 పెద్దగా చెప్పుకోవలసిన అవసరం ఉండదు .. శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం పర్వాలేదు. థ్రిల్లర్ చిత్రాలకు పని చేసిన అనుభవాన్ని చూపించాడు. పాటలు ఒకట్రెండే ఉన్నా అవి కూడా అనవసరం అనిపిస్తుంది. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం వృధా .  జానర్ కు తగ్గ కలర్ థీమ్ ఎంచుకున్నప్పటికీనా.. విజువల్స్ పరంగా ఏ ప్రత్యేకతా లేదు. నిర్మాణ విలువలు పేలవంగా ఉన్నాయి.దర్శకుడు అనిల్ శ్రీకాంతం ఏ రకంగానూ మెప్పించలేకపోయాడు. దర్శకుడు అనిల్ ఇంట్రస్టింగ్ సబ్జెక్టు ను తెర మీదకు తీసుకురావడంలో కొన్నిచోట్ల తడబడ్డాడు. క్రైమ్ థ్రిల్లర్ అంటేనే ఆసక్తికర మలుపులు , ఉత్కంఠతో కూడిన స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేస్తారు కాని ఈసినిమాలో అవి మిస్ అయ్యాయి. దాంతో సినిమా కొన్ని చోట్ల సాగదీసి నట్లుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ స్లో సాగుతూ ప్రేక్షకుడిని నీరసం తెప్పిస్తుంది. ఇక హీరో , హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాటిక్ గా అనిపిస్తాయి. వీటితో పాటు లో బడ్జెట్ కూడా ఈచిత్రం   ఫలితాన్ని దెబ్బతీసింది. ఇంట్రస్టింగ్ పాయింట్ ఉన్న కథకు సరైన కథనం తోడైయితే సినిమా ఫలితం ఊహించినదానికంటే ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ చిత్రం కథనం విషయం లో నిరాశపరచడంతో ఆ ప్రభావం సినిమా ఫలితం ఫై పడింది.

విశ్లేషణ : 

ఒక సీరియస్ పాయింట్ తో తెరకెక్కిన సినిమా. కానీ ప్రేక్షకుడిని సీరియస్ గా ఇన్వాల్వ్ చేసేలా ఏ అంశాలూ ఇందులో లేవు. అసలే వనరులు లేకపోగా.. కొత్త దర్శకుడు అనిల్ శ్రీకాంతం అనుభవ లేమి కూడా తోడై.. ఒక బి-గ్రేడ్ సినిమా చూస్తున్న భావన కలిగిస్తుంది  దర్శకుడు లీడ్ పాయింట్ నే సరిగా డీల్ చేయకపోగా.. ఇక అతను తీర్చిదిద్దిన ప్రేమకథ.. ఇతర అంశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక మంచి పాయింట్ ను ఎంత పేలవంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చో చెప్పడానికి ‘ఇదం జగత్’ రుజువు. ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అని వెతికినా కనిపించని ఈ చిత్రం సుమంత్ కెరీర్ కు ఏ రకంగానూ ఉపయోగపడే అవకాశం లేనట్లే.  హాలీవుడ్లో వచ్చే సినిమాల్లో ఏదైనా ఎగ్జైటింగ్ పాయింట్ కనిపిస్తే.. దాన్ని కాపీ చేసేయడం.. దాని చుట్టూ మన నేటివిటీతో కథ అల్లేసి సినిమా తీసేయడం..  చాలామంది చేసే పనే ఇది. 

Recent reviews