ఎన్టీఆర్ మొదటి రోజు వసూళ్లు 

10 Jan,2019

మహా నటుడు అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగంగా 'కథానాయకుడు' గా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన అన్ని ప్రాంతాల్లోని థియేటర్స్ దగ్గర భారీస్థాయిలో సందడి కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజున 7.61కోట్ల షేర్ ను వసూలు చేసింది.  యు ఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు   600పైగా స్క్రీన్స్‌పై ఈ చిత్రాన్ని ప్రదర్శించగా.. బాలయ్య కెరియర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ రికార్డులకెక్కింది. ప్రీమియర్స్ ద్వారా 5,19,000 డాలర్ల (దాదాపు మూడున్నర కోట్ల రూపాయలకు పైగానే) కలెక్షన్లను కొల్లగొట్టింది. మొత్తానికి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుని 10 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 

Recent Old Stories

LATEST NEWS

ACTRESS GALLERY