హీరో విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ

18 Nov,2018

పైరసీని బ్యాన్ చేయాలి 

 - హీరో విజయ్ దేవరకొండ  

 
 ఫైరసీ వల్ల మా సినిమాకె కాదు ఏ సినిమా కైనా ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల ఆడియన్స్ సినిమా చూడటానికి థియేటర్స్ కి వస్తారా లేదా అన్న టెన్సన్స్ అయితే ఉంటుందిగా, అంతెందుకు పెళ్లి చూపులు సినిమా ఫైరసీ జరిగి ఉంటే.. నాకు ఆ తరువాత సినిమాలు వచ్చి ఉండేవి కావు. నేను ఇంతదూరం వచ్చి ఉండేవాడ్ని. ఏమైనా ఫైరసీని బ్యాన్ చెయ్యాలి అని అంటున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. లేటెస్ట్ గా గీత గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ తాజాగా టాక్సీవాలా గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌ పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ నిర్మిస్తోన్న   ‘టాక్సీవాలా’ ఈనెల 17న విడుదల కాబోతున్న సందర్భంగా విజయ్‌ దేవరకొండ చెప్పిన విశేషాలు .. 
 
అందరి గురించి ..    

 ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రభావితం చేసారు అనేదాని కంటే.. సినిమా కోసం వాళ్ళు ప్రాణం పెట్టారు. అయినా నేను  టెక్నీషయన్స్ గురించి చెప్పడానికి ప్రధాన కారణం సినిమా కోసం వాళ్ళు ఎంత కష్ట పడ్డారో, సినిమా ఫైరసీ అయినప్పుడు వాళ్ళు ఎంత బాధను నుభవించారో అందరికీ తెలియాలి. అప్పుడే మా బాధ ప్రేక్షకులకు అర్ధమవుతుందని అక్కడ మాట్లాడా.  

 ఫైరసీ ఎఫెక్ట్ .... 

నిజమే. కానీ అన్ని సినిమాలకి అలాగే జరగాలని లేదుగా. ఫైరసీ వల్ల మా సినిమాకి ఏమైన ఎఫెక్ట్ అవుతుందా ? ఆడియన్స్ సినిమా చూడటానికి థియేటర్స్ కి వస్తారా లేదా అన్న టెన్సన్స్ అయితే ఉంటాయిగా. పెళ్లి చూపులు సినిమా ఫైరసీ జరిగి ఉండి ఉంటే.. నాకు ఆ తరువాత సినిమాలు వచ్చి ఉండేవి కావు. నేను ఇంతదూరం వచ్చి ఉండేవాడ్ని. ఏమైనా ఫైరసీని బ్యాన్ చెయ్యాలి. పోర్న్ సైట్స్ ను బ్యాన్ చేసినట్లుగానే ఫైరసీ సైట్స్ ను కూడా బ్యాన్ చెయ్యాలి.

నా  సినిమాలే ... 

ఆ విషయం గురించి నాక్కూడా తెలియదు. అయితే ఎవరో కావాలని నా సినిమాల్ని ఫైరసీ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. ఫైరసీ అనేది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న సమయంలో టీమ్ లో ఉన్న వ్యక్తి మాత్రమే చెయ్యడానికి అవకాశం ఉంది. ‘గీత గోవిందం’ కూడా అలాగే ఫైరసీ అయింది. ఏమైనా ఒక సినిమాని ఫైరసీ చేస్తే.. ఆ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరి లైఫ్ తో ఆడుకున్నట్లే.  అసలు ఎవరు ఈ ఫైరసీ చేస్తున్నారో తెలిస్తే కదా.. వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవటానికి. ఫైరసీ గురించి చాలా వెబ్ సైట్స్ ఉన్నాయి. ముందు వాటిని బ్యాన్ చేస్తే అన్ని సర్దుకుంటారు.  

‘టాక్సీవాలా’ ... 

టాక్సీవాలా పై అంచనాలు బాగానే ఉన్నాయి. నేను ఈ అంచనాలు అస్సలు నమ్మను. ఎవరైనా సినిమా బాగుంది అంటేనే చూస్తారు. లేదంటే ఎవ్వరు చూడరు. నేను అదే నమ్ముతాను. కానీ చాలామంది నాతో కూడా అంటుంటారు నీ సినిమా పై భారీ ఎక్స్ పేటెక్షన్స్ ఉన్నాయని. నేను వాట్ని సీరియస్ గా తీసుకోను. ఈ సినిమాలో కథ, కథనం, మ్యూజిక్, ఫోటోగ్రఫీ లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి. దర్శకుడు రాహుల్ అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే ఎస్ కె ఎన్ నిర్మాతగా ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంటాడు.  ఇక 
హీరోయిన్ ప్రియాంకా కొత్త అమ్మాయి. చాలా బాగా చేసింది. తప్పకుండ తనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. 

నోటా రిజల్ట్స్... 

నోటా రిలీజ్ ముందురోజే నేను ఆ సినిమాని చూసాను. నాకు అప్పుడే సినిమాలో కొన్ని మార్పులు చేస్తే బెటర్ అనిపించింది.  కానీ రేపు రిలీజ్ పెట్టుకొని, ఈ రోజు ఏమి చెయ్యలేం కదా. నాక్కూడా ఏదో చేయ్యాలని ఉంటుంది ఒక్కోసారి అది వర్కౌట్ అవుతుంది, ఇంకోసారి కాదు.
 
 బన్నీ పొగడ్త ..  

నిజంగా నేను వాట్ని వీలైనంత త్వరగా మర్చిపోవటానికి ట్రై చేస్తున్నాను. బన్నీ ఆన్న, చిరంజీవి గారు నా గురించి మాట్లాడటం అది వాళ్ళ గొప్పతనం. అంతటి స్టార్స్ నా గురించి అలా మాట్లాడటం నేను ఇప్పటికి నమ్మలేకపోతున్నాను.నాకు ఏభై సంవత్సరాలు వచ్చాక నా గురించి వాళ్ళు మాట్లాడినవి పెట్టుకొని చూస్తూ  ఎంజాయ్ చెయ్యాలని ఉంది.

కొత్త డైరెక్టర్స్ తోనే... 

నాకు కథ నచ్చితే.. ఆ సినిమానే చేస్తూ వచ్చాను. అయితే నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ఓ పెద్ద డైరెక్టర్ తోనే సినిమా చేస్తున్నాను. ఆయన ఎవరో ఇప్పుడు చెప్పలేను గాని, ఆయన సినిమాలకి మాత్రం నేను పెద్ద అభిమానిని. అలాంటి ఆయనే నాతో ఓ సినిమా చేస్తావా అని అడగటం నేను ఎప్పటికీ మర్చిపోలేను.

తదుపరి సినిమాలు .. 

ప్రస్తుతం డియర్ కామ్రేడ్ జరుగుతుంది. ఈ నెల చివర్లో మరో షెడ్యూల్ మొదలవుతుంది. ఇప్పటిదాకా ముపై శతం పూర్తయింది. దాంతో పాటు మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. 
 

Recent Old Stories

LATEST NEWS

ACTRESS GALLERY