సూర్యకాంతం రివ్యూ 

30 Mar,2019

దర్శకత్వం : ప్రణీత్ 
నిర్మాత : సందీప్ రెడ్డి, సృజన్ యఱబ్రోలు, రామ్ నరేష్ 
సంగీతం : మార్క్ కె రాబిన్ 
నటీనటులు : నిహారిక కొణిదల, రాహుల్ విజయ్, శివాజీ రాజా, సుహాసిని తదితరులు .. 
విడుదల : 29-03-2019
రేటింగ్ : 2.5 / 5

మెగా డాటర్ నిహారిక  ఈ సారి సూర్యకాంతం గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. కొత్త దర్శకుడు ప్రణీత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్యకాంతం ఎం చేసింది, ఎలా ఉంటుంది  అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 

కథ :  

సూర్యకాంతం ( నిహారిక ) చాలా గడుసు అమ్మాయి. ఆమెను తొలి చూపులోనే అభి ( రాహుల్ విజయ్ ) ఇష్టపడతాడు. ఈ నేపథ్యంలో సూర్యకాంతంతో పరిచయం చేసుకునే క్రమంలో ఆమె కూడా అభిని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. ఈ క్రమంలో సడన్ గా సూర్యకాంతం తల్లి ( సుహాసిని ) చనిపోవడంతో డిప్రెషన్ కు గురయిన సూర్యకాంతం అనుకోకుండా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆమెకోసం ఎదురు చూస్తున్న అభి ఇంట్లో వాళ్ళ ఫోర్స్ తో పూజ ( పేర్లిన్ బేసానియా ) అనే అమ్మాయితో వివాహం ఫిక్స్ చేస్తారు. పూజతో ప్రేమలో పడ్డ అభి సూర్యకాంతంని మరచిపోయి సంతోషంగా ఉంటాడు. అలా అభి సంతోషంగా ఉన్న సమయంలో సూర్యకాంతం సడన్ ఎంట్రీ ఇస్తుంది ? సూర్యకాంతం ఎంట్రీ తో షాక్ అయిన అభి ఎం చేసాడు ? సూర్యకాంతంనే అభి పెళ్లి చేసుకున్నాడా ? లేక పూజ ను చేసుకున్నాడా ?  ఇన్నాళ్లు సూర్యకాంతం ఎక్కడికి వెళ్ళింది లాంటి విషయాలు మిగతా కథ ..  
 
నటీనటుల ప్రతిభ : 

సినిమా మొత్తం సూర్యకాంతం పాత్ర చుట్టూనే తిరుగుతుంది. సూర్యకాంతం పాత్రలో .. అల్లరి అమ్మాయి .. గడుసు పిల్లగా నిహారిక చక్కగా చేసింది. ఒకరకంగా ఇది టామ్ బాయ్ పాత్ర అని చెప్పాలి. ఇక హీరో రాహుల్ విజయ్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించాడు. మరో హీరోయిన్ పూజ గా పేర్లిన్ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఈ కథను మలుపుతిప్పే పాత్ర కావడంతో మంచి మార్కులే కొట్టేసింది. ఇక సినిమాలో గ్లామర్ విషయంలో ఉన్న లోటును పూజ పాత్రతో పూర్తీ చేయడంతో సినిమాలో ఏ లోపాలు లేకుండా సాగిందని చెప్పాలి. ఇక మిగతా పాత్రల్లో శివాజీరాజా, సుహాసిని, కమెడియన్ సత్య వారి వారి పాత్రల్లో చక్కగా నటించి .. అక్కడక్కడా కామెడీ కూడా పండించే ప్రయత్నం చేసారు. 

టెక్నీకల్ హైలెట్స్ : 
 
సాంకేతిక అంశాలను పరిశీలిస్తే .. మార్క్ రాబిన్ అందించిన సంగీతం యావరేజ్ గా నిలిచింది. పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. అయితే నేపధ్య సంగీతం మాత్రం జస్ట్ ఓకే అని చెప్పాలి. ఇక ఫోటోగ్రఫి ఫరవాలేదు. చాలా సీన్స్ అందంగా చూపించే ప్రయత్నం చేశారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి .. మొత్తానికి నూతన దర్శకుడు ప్రణీత్ ఎంచుకున్న ఈ ట్రయాంగిలర్ లవ్ స్టోరీ పాతదే అయినప్పటికీ దాన్ని కొత్తగా తెరకెక్కించే విషయంలో కాస్త తడబాటు పడ్డాడు. సన్నివేశాల మధ్య పొంతన కుదరకపోవడం లాంటి అంశాలు కన్ఫ్యూజ్ చేస్తాయి. కథ మొత్తం బోరింగ్ గా సాగుతుంది. అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసినప్పటికీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. కథ మొత్తంగా బోరింగ్ గా సాగినా క్లయిమాక్స్ విషయంలో మాత్రం ఆకట్టుకున్నాడు దర్శకుడు. 

చివరగా  :  
 
పాత కథ కొత్త తరహా ట్రీట్మెంట్ తో బిన్నంగా చేయాలన్న ప్రయత్నం బెడిసికొట్టింది. కథను చాలా నీరసంగా నడిపించిన దర్శకుడు ఏ విషయంలో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేయలేదు. సినిమా విషయంలో కథ పెద్ద మైనస్ గా మారింది. ఆసక్తి లేని కథ .. దానికి తోడు ఆకట్టుకొని సన్నివేశాలు, బోరింగ్ కథనంతో సినిమా నీరుగారిపోయేలా చేసింది. సూర్యకాంతం పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలాంటి ప్రేమ కథకు బలమైన సన్నివేశాలు కావాలి కానీ అలాంటివి ఏమి లేకుండా ఎలాంటి ఆసక్తి లేకుండా కథను నడిపించాడు దర్శకుడు.  

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY