ఎన్టీఆర్ మహానాయకుడు  రివ్యూ

23 Feb,2019

దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
నిర్మాత : నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవి
సంగీతం : కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్
ఎడిటర్ : రామకృష్ణ
నటీనటులు : బాలకృష్ణ , విద్యాబాలన్, రానా, కళ్యాణ్ రామ్, వెన్నల కిషోర్ తదితరులు.
విడుదల తేదీ : ఫిబ్రవరి 22, 2019
రేటింగ్ : 2. 75 / 5

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. దానికి రెండో భాగంగా ఎన్టీఆర్  ‘మహానాయకుడు’ శుక్రవారం విడుదల అయింది. మరి ఎన్టీఆర్ సినీ నాయకుడిగా విజయం సాధించాడు .. మరి మహా నాయకుడిగా అయన ప్రస్థానం ఎలా ఉందొ తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.. 

కథ :

ఎన్టీఆర్ (బాలకృష్ణ ) తెలుగు దేశం పార్టీ పెట్టి.. అతి తక్కువ టైంలోనే తన ఇమేజ్ కారణంగా అఖండ విజయం సాధిస్తారు. ప్రజలకు  ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ఎన్నో మంచి పనులు చేస్తారు. అయితే ఈ క్రమంలో కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకుల స్వార్ధపూరిత ఆలోచనల కారణంగా… ఆ ఆలోచనలకు అప్పటి కేంద్రప్రభుత్వం అండ దొరకడంతో.. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుండి దింపేస్తారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం తిరిగి ఎన్టీఆర్ ఎలా ముఖ్యమంత్రి అయ్యారు ? ఆ క్రమంలో ఆయన ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నారు ? ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవ్వడానికి చంద్రబాబు పాత్ర ఏమిటి ? అలాగే భార్య బసవతారకం పాత్ర ఎలా సాగింది ? చివరకి ఎన్టీఆర్ మహా నాయకుడిగా దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడు ? లాంటి విషయాలు మిగతా కథ. 
 
నటీనటుల ప్రతిభ :

ఈ సినిమాకు ప్రధాన బలం నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య పరకాయ ప్రవేశం చేశారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ లోని  హావభావాలను, బాలయ్య పలికించిన విధానం ప్రేక్షకులను అబ్బుర పరుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయాక వచ్చే అసెంబ్లీ సన్నివేశాల్లో గానీ, అలాగే బసవతారకం ఆరోగ్యం విషయంలో ఎన్టీఆర్ కన్నీళ్ళు పెట్టే సన్నివేశంలో గానీ బాలయ్య నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను పోషించిన విద్యాబాలన్ అద్భుతంగా నటించి మెప్పించింది. ముఖ్యంగా బాలయ్య – విద్యాబాలన్ ల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. చంద్రబాబు పాత్రలో కనిపించిన రానా, హరికృష్ణ పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్, అక్కినేని పాత్రలో నటించిన సుమంత్ మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ తమ నటనతో ఆకట్టుకున్నారు. మరో ప్రధాన పాత్ర నాదెండ్ల భాస్కరరావు పాత్రలో నటించిన సచిన్ ఖేడేకర్ కూడా ఆ పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు.  
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. క్రిష్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అలాగే సాయిమాధవ్ బుర్రా మాటలు బాగానే పేలాయి.

టెక్నీకల్ హైలెట్స్ : 

సంగీత దర్శకుడు కీరవాణి పాటలు బాగున్నాయి .. ముక్యంగా నేపథ్య సంగీతంతో ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు.  జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆయన కథకి అనుగుణంగా సినిమాలోని సన్నివేశాలని, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చక్కగా చిత్రీకరించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ   విలువులు   బాగున్నాయి. తెలుగు సినీ పరిశ్రమను ఏకైక మ‌హారాజులా కొన్ని ద‌శాబ్దాల పాటు తన కను సైగలతోనే ఏలారు ఎన్టీఆర్, అదే విధంగా.. రాజయాలను సైతం శాసించి.. ప్రతి తెలుగు వాడి హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అంతటి మహానటుడు, మహానాయకుడు గురించి సినిమా తీసి మెప్పించడం అంటే.. మాములు విషయం కాదు. అయితే క్రిష్ మాత్రం ఈ విషయంలో చాలా వరకు విజయం సాధించాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ అంశాలనూ, అప్పటి పరిస్థితులను చాలా ఆసక్తికరంగా చూపించాడు క్రిష్.  కానీ   ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించి చెప్పాలనుకున్న మెయిన్ కథతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు క్రిష్, కొన్ని సీన్స్ ను మాత్రం నెమ్మదిగా నడిపించారు. అయితే సినిమాలో కీలకమైన భాగాన్ని ఎమోషనల్ గా నడిపిన క్రిష్, కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆ ఎమోషన్ని ఆ స్థాయిలోనే కంటిన్యూ చేయలేక పోయాడు. పైగా చంద్రబాబు పాత్రకు సంబంధించిన సీన్స్ ను వాస్తవానికి కొంత దూరంగా చూపించిన భావన కలుగుతుంది.  బయోపిక్ కాబట్టి ఎలాంటి రెగ్యూలర్ కమర్షియల్ అంశాలు ఎక్స్ పెక్ట్ చెయ్యకూడదు. 

చివరగా :

 తెలుగు సినీ పరిశ్రమను మరియు రాజకీయాలను  ఏలిన ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మహానటుడు’ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ గా సాగుతూ హృదయానికి తాకుతుంది. మ‌హ‌నేత‌గా ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించి దర్శకుడు  చెప్పాలనుకున్న మెయిన్ కథతో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో బాగా ఆకట్టుకుంటాడు. అయితే సినిమాలో కీలకమైన భాగాన్ని ఎమోషనల్ గా నడిపిన క్రిష్, కొన్ని సన్నివేశాల్లో మాత్రం ఆ ఎమోషన్ని ఆ స్థాయిలోనే కంటిన్యూ చేయలేక పోయాడు.   కొన్ని సీన్స్ ను కూడా ఆయన నెమ్మదిగా నడిపించారు.  మొత్తం మీద ఎన్టీఆర్ అభిమానులకు  మాత్రం నచ్చే చిత్రం అని చెప్పాలి. 

Recent reviews

LATEST NEWS

ACTRESS GALLERY