ఛాయాగ్రహణం: రాజశేఖర్
సమర్పణ : క్రిష్ జాగర్లమూడి
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి - సాయిబాబా జాగర్లమూడి
రచన - దర్శకత్వం: సంకల్ప్
నటీనటులు: వరుణ్ తేజ్ - అదితి రావు హైదరి - లావణ్య త్రిపాఠి - అవసరాల శ్రీనివాస్ తదితరులు
విడుదల : 21- 12- 2018
రేటింగ్ : 2 75 / 5
ఈ మధ్య తెలుగులో ప్రయోగాత్మక చిత్రాలు చాలానే వస్తున్నాయి .. అయితే ఇన్నేళ్ల తెలుగు పరిశ్రమలో మొదటి సారి ఓ స్పేస్ నేపథ్యంలో సినిమా రూపొందడం విశేషం. ఘాజి లాంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన సంకల్ప్ తన రెండో ప్రయత్నంగా స్పేస్ నేపధ్యలో అంతరిక్షం సినిమా తెరకెక్కించాడు. మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అతిథి రావు హైదరీ హీరో హీరోయిన్స్ గా నటించినా ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల అయింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతరిక్షంలో ఏమి జరిగిందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
దేవ్ (వరుణ్ తేజ్) ఇండియన్ స్పేస్ సెంటర్లో శాస్త్రవేత్త. రష్యాలో శిక్షణ తీసుకుని వచ్చి కీలకమైన ప్రాజెక్టుల్లో పని చేసిన అతను తన చేతుల మీదుగా తయారైన విప్రియాన్ అనే శాటిలైట్ ను చంద్రుడి మీదికి పంపించే పని చేస్తుంటాడు. ఐతే అనుకోని కారణాలతో అది విఫలమవుతుంది. అదే సమయంలో దేవ్ ప్రేమించిన అమ్మాయి పారు (లావణ్య త్రిపాఠి) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతుంది. దీంతో డిస్టర్బ్ అయిన దేవ్ తన ఉద్యోగం విడిచిపెట్టి తమిళనాడులోని మారుమూల ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా చేరతాడు. ఆ తరువాత ఐదేళ్ల కు స్పేస్ సెంటర్లో ఉన్న మిహిర స్పేస్ ప్రాజెక్టు విషయంలో సమస్య తలెత్తుతుంది. ఆ సమయస్య సాల్వ్ చేయడానికి వచ్చిన అథితి రావు ఈ సమస్యను సాల్వ్ చేయాలంటే ఒక్క దేవ్ వల్లే అవుతుందని అతన్ని మళ్ళీ స్పేస్ సెంటర్ కు తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో స్పేస్ లో ఉన్న సమస్యను తన టీమ్ తో సాల్వ్ చేసిన దేవ్ అనుకోకుండా మరో సమస్యను సాల్వే చేయాలనీ ప్లాన్ చేస్తాడు. వీరు నలుగురూ కలిసి మిహిరలో సమస్యను సరిచేస్తారు. అయితే భూమిపైకి తిరిగి రావడానికి దేవ్ అంగీకరించడు. ‘మిషన్ కిన్నెర’ను తెరపైకి తీసుకొస్తాడు. ఇంతకీ మిషన్ కిన్నెర ఏమిటి ? దానివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తాయి .. వాటిని ఎలా సాల్వ్ చేసాడన్నది మిగతా కథ.
నటీనటుల ప్రతిభ :
ఇక నటీనటుల గురించి చెప్పాలంటే .. కెరీర్ ప్రారంభం నుండే భిన్నమైన సినిమాలతో ప్రయోగాలు చేస్తున్నాడు. నిజంగా వరుణ్ తేజ్ అతనెంచుకున్న సినిమాల విషయంలో అభినందించాలి. ‘అంతరిక్షం’తో మరోసారి అతను తన అభిరుచిని చాటుకున్నాడు. దేవ్ పాత్రకు అతను కరెక్టుగా సూటయ్యాడు. అదితి రావు హైదరి పరిణతితో కూడిన నటనతో మెప్పించింది. లావణ్య ఉన్నది కాసేపే అయినా బాగానే చేసింది. అవసరాల శ్రీనివాస్.. సత్యదేవ్ తమ ప్రత్యేకత చాటుకున్నారు. రెహమాన్.. రాజా కూడా బాగా చేశారు. నటీనటులందరూ వారి వారి పాత్రలకు బాగా సెట్టయ్యారు. తమ పరిధిలో చక్కగా నటించారు.
టెక్నీకల్ హైలెట్స్ :
ఈ సినిమాకు టెక్నీకల్ అంశాలే కీలకం అని చెప్పాలి .. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారిఇచ్చిన రెండు పాటలూ బాగాన్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సన్నివేశాల్లో ఉత్కంఠ పెంచడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. కెమెరామన్ రాజశేఖర్ అనుభవం సినిమాకు బాగా ఉపయోగపడింది. ఏది ఎఫెక్ట్.. ఏది రియల్ అనే కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ.. అక్కడక్కడా కెమెరా పనితనం కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నంతలో బాగానే ఉన్నాయి. దీనికున్న పరిమితుల్లో బాగానే చేశారు. కొన్నిచోట్ల వీఎఫెక్స్ బాగున్నాయి.. కొన్ని చోట్ల స్థాయికి తగ్గట్లు లేవు. ఇక దర్శకుడు సంకల్ప్.. మరోసారి భిన్నమైన జానర్ ప్రయత్నించి ప్రత్యేకత చాటుకోవాలనుకున్నాడు. రాకెట్ సైన్స్ గురించి సాధ్యమైనంత వరకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు. ఎక్కడా స్థాయి తగ్గకుండా కథకు కట్టుబడి తాను చెప్పాలనుకున్నది చెప్పాడు సంకల్ప్. కాకపోతే ఈసారి అతను ‘ఘాజీ’ తరహా ఇంట్రెస్ట్ ని మాత్రం క్రియేట్ చేయాలొకపోయాడు. ‘ఘాజీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నే కాక.. ఇతర భాషల ఆడియన్స్ ను కూడా విస్మయానికి గురి చేశాడు సంకల్ప్. ఒక కొత్త దర్శకుడు అలాంటి కథను ఎంచుకుని తొలి ప్రయత్నంలోనే అంత పకడ్బందీ సినిమా తీయడం అనూహ్యమే. తన రెండో ప్రయత్నంలో కూడా సంకల్ప్ అలాంటి సాహసోపేత కథనే ఎంచుకున్నాడు. తొలి సినిమాలో ప్రేక్షకుల్ని నీటిలోకి తీసుకెళ్లి ఉక్కిరిబిక్కిరి చేసిన సంకల్ప్.. ఈసారి అంతరిక్షంలో విహరింపజేశాడు. ఎంచుకున్న జానర్.. కథ విషయంలో సంకల్ప్ ను అభినందించవచ్చు. సినిమా చూస్తున్నంతసేపూ.. ఈ డైరెక్టర్ ఎంత కష్టపడ్డాడు .. ఎంత పరిశోధన చేశాడు అన్న భావన కలుగుతూనే ఉంటుంది.
విశ్లేషణ :
‘అంతరిక్షం’ నేపథ్యంలో కథను బాగానే తయారుచేసుకున్న దర్శకుడు కథనాన్నిమాత్రం పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో కొన్నిటిని మాత్రం డల్ అయ్యాడు. సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, హీరో అండ్ టీమ్ ఎలాంటి కష్టాల్లో పడతారో, వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా సినిమాని నడపలేదు. ఇక సినిమా ఫస్టాఫ్ కథనం కూడ సాదా సీదాగానే గడిచిపోయింది. హీరో మిషన్ లోకి రావడం వరకు బాగానే ఉన్నా ప్రీ ఇంటర్వెల్ ముందుకి వరకు కథనం నెమ్మదిగానే సాగుతుంది. పైగా స్పేస్ సినిమాల్లో ఉండాల్సిన సీరియస్ నెస్ కూడా ఈ చిత్రంలో కొంత కరువైందనే చెప్పాలి. దీనికి తోడు సినిమాలో కొన్ని చోట్ల మరీ సినీమాటిక్ గా అనిపిస్తోంది. హాలీవుడ్ స్పేస్ సినిమాలు చూడని వాళ్లకు ‘అంతరిక్షం’లో జరిగేదంతా కొత్తగా అనిపించవచ్చు. ప్రేక్షకుల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేసే అంశాలు ఇందులో మిస్సయ్యాయి. హీరో పాత్రను సరిగా తీర్చిదిద్దకపోవడమే కారణం. తన కలల ప్రాజెక్టు ఫెయిలైనంత మాత్రాన హీరో ఉన్నట్లుండి అన్నీ వదిలేసి ఎవరికీ చిక్కకుండా ఐదేళ్ల పాటు ఎక్కడో దూరంగా ఉండటం.. తర్వాత ఉన్నట్లుండి సమస్య తలెత్తగానే వచ్చే హీరోయిజం చూపించేయడం సహేతుకంగా అనిపించదు. ఇక్కడ బలమైన కారణాల్ని చూపించడంలో.. దర్శకుడు విఫలమయ్యాడు. కమర్షియల్ సినిమాల్లో నేలమీద నిలబడి ఎన్ని విన్యాసాలు చేసినా ఓకే కానీ.. ఇలాంటి జానర్ సినిమాలో అంతరిక్షంలో హీరో చేసే విన్యాసాలే మరీ అతిగా అనిపిస్తాయి. దీనికి తోడు కథనంలో ఆశించినంత వేగం లేకపోవడం కూడా మైనస్సే. కాకపోతే తెలుగులో మనకున్న పరిమితుల్లో ఇలాంటి ఒక ప్రయత్నం జరగడం మాత్రం మెచ్చదగిందే.