యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతొన్న చిత్రం "దుప్పట్లో మిన్నాగు". చిరంజీవి క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి అమర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో ప్రఖ్యాత కన్నడ కధానాయిక చిరాశ్రీ నటిస్తొంది.
నవ్య వారపత్రికలో నవలల పోటీలో 50,000 ప్రథమబహుమతి పొందిన దిండు కింద నల్ల త్రాచు నవల ఆధారంగా రూపొందుతొన్న చిత్రమిది.ఈ చిత్ర టీజర్ ను సిరివెన్నెల విడుదల చేశారు. చిత్రానికి సంబందించిన కొన్ని సన్నివేశాలను విచ్చెసిన అతిథుల చేత పదర్శించారు. యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ..12 సం. క్రితం వచ్చిన ఓ చిన్న ఐడియా తో ఈ కథ రాయటం జరిగింది. ఓ ఇంటర్యూ లొ,ఓ అర్దరాత్రి,నీ జెండర్ మారిపొతే ఏ చెస్తారు అన్న ప్రశ్న కు. ఓ అమ్మాయి చెప్పిన సమాదానం , అందులొ ఉన్న డెప్త్ ను అర్దంగా చెసుకుని ఈ కథను రాయటం జరిగింది. కాశ్మీర్ ఉగ్రవాదం నేపథ్యంలో అకస్మాత్తుగా తప్పిపొయిన తండ్రిని , ఓ కూతురు ఎలా వెతికి పట్టుకుంది. తీవ్రవాదులని ఎలా మట్టు పెట్టిందన్న కథాశంతో రూపొందించిన చిత్రమిది.నిర్మాత..కె.ఎస్.రామారావు, మిత్రుడు కొదండ రామిరెడ్డి వారిరువురు రావటం సంతోషమన్నారు. కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.. దుప్పట్లో మిన్నాగు కథ చదివాను. సినిమాగా చాలా అప్డెటెడ్ గా యండమూరి గారు తీశారు. కాంటెపరరీ టెక్నిషియన్స్ కు ఏమాత్రం తీసిపొకుండా అడ్వాన్స్డ్ గా తీశారన్నారు.
మేథా చిరంజీవి మాట్లాడుతూ.. యండమూరి గారు ఈ సినిమాకు అన్నీ తానే తీశారు. రచయితగా , దర్శకుడు గా ఆయన ప్రూవ్డ్. సినిమా ఆకట్టుకుంటుంది అలాగే ఆలొచింప చెస్తుందన్నారు. దర్శకులు కొందడరామిరెడ్డి మాట్లాడుతూ.. సినిమా చూశాను. అంతా బాగుంది.ఇప్పుడున్న పరిణామాలకు కరెక్ట్ గా సరిపొయె చిత్రం. ఆయన 12 నవలలు నేను సినిమాలుగా చేశాను. అవి అన్నీ హిట్టె. నాకు దర్శకుడిగా పేరు తెచ్చాయి.గురువుగారి సినిమా బాగా ఆడాలని ఆశిస్తున్నానన్నారు.
దర్శకులు అజయ్ మాట్లాడుతూ.. యండమూరి దారి సినిమా అంటే మా సొంత సినిమా లెక్క. "దుప్పట్లొ మిన్నాగు" టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. యువ దర్శకులకు స్పూర్తి గా ఈ సినిమా మేకింగ్ ఉంటుందన్నారు
నిర్మాత చల్లపల్లి అమర్ మాట్లాడుతూ: 1992 నుంచి ప్రొడక్షన్ లో ఉన్నాను. యాడ్ ఫిలింస్, డాక్యుమెంటరీలు చెస్తుంటాను.ఇది మా తొలి చిత్రం . ఈ సినిమా ను చాలా తక్కువ టైమ్ లో తీశాం. అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. యండమూరి గారు నాకు స్పూర్తి నిచ్చిన వ్యక్తి. ఈ రోజు ఆయనతో సినిమా చేయటం ఆనందంగా ఉందన్నారు.