118 ప్రీ రిలీజ్ వేడుక 

26 Feb,2019

నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న స్టైలిష్‌ యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ '118'. నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 1న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన ప్రీరిలీజ్ ఫంక్ష‌న్‌లో బిగ్ సీడీని నంద‌మూరి బాల‌కృష్ణ విడుద‌ల చేశారు. ఆడియో సీడీని బాల‌కృష్ణ, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ విడుద‌ల చేయ‌గా, తొలి సీడీని ఎన్టీఆర్ అందుకున్నారు. ...అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ - ``118` డైరెక్ట‌ర్ గుహ‌న్ నాకు అసోసియేట్ కెమెరామెన్‌గా ఖుషీ సినిమా స‌మ‌యంలో నాకు ప‌రిచ‌యం అయ్యాడు. త‌ర్వాత సినిమాటోగ్రాఫ‌ర్‌గా ఎదిగారు. ఇప్పుడు డైరెక్ట‌ర్ అయ్యారు. ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటే క‌థ‌లోని కొత్త‌ద‌నం అర్థ‌మ‌వుతుంది కల్యాణ్ రామ్ ప్ర‌తి సినిమాలో ఏదో ఒక‌టి కొత్త‌గా చేయాల‌ని చూస్తుంటారు. ఇక నిర్మాత విష‌యానికి వ‌స్తే.. మ‌హేష్ కొనేరు పి.ఆర్వోగా స్టార్ట్ అయ్యి.. ఇప్పుడు నంద‌మూరి హీరో సినిమాకు ప్రొడ్యూస‌ర్‌గా ఎదిగాడు. ప్ర‌తి ఒక్క‌రూ సినిమా కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డారు. మా సంస్థ ద్వారా సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల‌వుతుండ‌టం ఆనందంగా ఉంది. ఎంట‌ర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.
శేఖ‌ర్ చంద్ర మాట్లాడుతూ - ``నంద‌మూరి హీరో సినిమాకు సంగీతం అందించ‌డం చాలా సంతోషంగా ఉంది. అవ‌కాశం ఇచ్చిన మ‌హేష్ కొనేరుగారికి థాంక్స్‌. థ్రిల్ల‌ర్స్ చాలానే చూసుంటారు. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే ఇన్‌టెన్స్‌తో పాటు ఎమోష‌న్స్ ఉన్న సస్పెన్స్ థ్రిల్ల‌ర్ ఇది. గుహ‌న్‌గారి విజువ‌ల్స్‌తో మ్యాచ్ చేస్తూ మ్యూజిక్ చేయ‌డం చాలెంజింగ్‌గా అనిపించింది`` అన్నారు.
నివేదా థామ‌స్ మాట్లాడుతూ - ``మా ఫంక్ష‌న్‌కి వ‌చ్చిన బాల‌కృష్ణ‌గారు, తార‌క్‌, దిల్‌రాజుగారికి థాంక్స్‌. బాల‌కృష్ణ‌గారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమా విష‌యంలో స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్కరికీ థాంక్స్‌. ఇలాంటి సినిమా చేయ‌డం నా ఆశీర్వాదంగా భావిస్తున్నాను. గుహ‌న్‌గారికి డైరెక్ట‌ర్‌గా తొలి సినిమా. చాలా టెన్ష‌న్‌గా ఫ‌లితం కోసం వెయిట్ చేస్తున్నారు. మంచి సినిమాల‌ను ఆద‌రించే తెలుగు ప్రేక్ష‌కులు ఈ సినిమాను ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను. డిఫ‌రెంట్ మూవీ.. సినిమా చూసిన అందరికీ న‌చ్చుతుంది`` అన్నారు.
షాలిని పాండే మాట్లాడుతూ - ``స్క్రిప్ట్ విన‌గానే నాకు చాలా బాగా న‌చ్చింది. కె.వి.గుహ‌న్‌గారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. మంచి ఎమోష‌న్స్ సినిమాలో చూస్తారు. ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్`` అన్నారు.
డైరెక్ట‌ర్ కె.వి.గుహ‌న్ మాట్లాడుతూ - ``బాల‌కృష్ణ‌గారు, ఎన్టీఆర్‌గారు ఈ వేడుక‌కి రావ‌డం మా అదృష్టంగా భావిస్తున్నాను. కొత్త పాయింట్‌ను న‌మ్మి సినిమా చేయ‌డానికి అంగీక‌రించిన క‌ల్యాణ్‌రామ్‌గారికి థాంక్స్‌. చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉంది. నివేదా చుట్టూనే ఈ సినిమా న‌డుస్తుంది. త‌ను బెస్ట్ జాబ్ చేశారు. త‌న పాత్ర‌కు ఊపిరి పోశారు. అర్జున్‌రెడ్డి త‌ర్వాత షాలిని పాండే మా సినిమాలో న‌టించినందుకు ఆమెకు థాంక్స్‌. అమ్మిరాజుగారికి, శేఖ‌ర్ చంద్ర‌, కిర‌ణ్, బాబ్జీ, అరుణ్‌, మ‌హేష్ కొనేరు స‌హా అంద‌రికీ థాంక్స్. ఫైన‌ల్ ఔట్‌పుట్ చూసి సినిమాను విడుద‌ల చేస్తున్న దిల్‌రాజుగారికి థాంక్స్‌. సీజీ టీం అద్వైతకు థాంక్స్‌. అలాగే నాకు స‌పోర్ట్ చేసిన నా డైరెక్ష‌న్ టీంకు థాంక్స్‌`` అన్నారు. 
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ మాట్లాడుతూ - ``బాబాయ్ బాల‌కృష్ణ‌గారికి, త‌మ్ముడు తార‌క్‌కి థాంక్స్‌. ఈ సినిమా గురించి రిలీజ్ త‌ర్వాత మాట్లాడుతాను. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమాలో ప‌నిచేసిన నివేదా, షాలిని, నాజ‌ర్ స‌హా అందరికీ థాంక్స్‌. కొత్త‌ద‌నం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి నేను ప్ర‌తిసారి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాను. కానీ ఫెయిల్ అయ్యాను. నాతో పాటు అభిమానుల‌కు కూడా ఈ విష‌యంలో బాధ ఉంది. టెంప‌ర్ సినిమా తమ్ముడు తార‌క్ చెప్పిన‌ట్లు ఎప్పుడూ నేను కూడా ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను మెప్పించ‌డానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ ఉంది. కె.వి.గుహ‌న్‌గారికి థాంక్స్‌`` అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ - ``ఈ ఫంక్ష‌న్‌ని ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డ‌కు వ‌చ్చిన మా బాబాయ్ బాల‌కృష్ణ‌గారికి థాంక్స్‌. నాకు, గుహ‌న్‌గారు చాలా ఏళ్లుగా ప‌రిచ‌యం. ఆయ‌న‌తో నేను బాద్‌షా సినిమాకు ప‌నిచేశాను. ఆయ‌న‌తో చాలా క‌ష్ట‌ప‌డే త‌త్వ‌మున్న వ్య‌క్తి. ఆ సినిమాలో బంతిపూల జాన‌కి సాంగ్ చాలా బాగా వ‌చ్చిందంటే ఏకైక కార‌ణం గుహ‌న్‌గారే. పాట‌ను అద్బుతంగా తెర‌కెక్కించారు. అంతే అద్భుతంగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో 118 సినిమా రూపొందింది. గుహ‌న్‌గారికి ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాని గొప్ప సినిమా అవుతుంద‌ని భావిస్తున్నాను. నివేదా థామ‌స్, షాలినికి అభినంద‌న‌లు. ఈ సినిమాను చూశాను. నివేదా పెర్ఫామెన్స్ చూసి నాకు తెలియ‌కుండానే క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. మా జ‌న‌రేష‌న్‌లో ఇంత గొప్ప న‌టి ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఆమె ఇలాగే కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నాను. షాలినిగారు కూడా ఎంతో హుందాగా న‌టించారు. ఈ సినిమాకు ప‌నిచేసిన ఇత‌ర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల‌కు అభినంద‌న‌లు, ధ‌న్య‌వాదాలు. నిర్మాత మ‌హేష్ మాకు బాగా కావాల్సిన వ్య‌క్తి. ఈ సినిమాతో త‌ను అద్భుత‌మైన విజ‌యాన్ని సాధించి, ఎన్నో అద్బుత‌మైన విజ‌యాలు సాధించ‌డానికి ప‌రంప‌ర‌ను ఈ చిత్రం ద్వారా మొద‌లు పెట్ట‌బోతున్నాడు. ఇక అన్న‌య్య క‌ల్యాణ్ రామ్‌.. కొత్త దోర‌ణిలో క‌థ చెప్పాల‌నే ఆయ‌న‌ ప‌డే క్యూరియాసిటీ నాకు తెలుసు. ఆయ‌న అందించిన చిత్రాల్లో నాకు ఇది చాలా బాగా న‌చ్చింది. హ్యాట్సాఫ్ క‌ల్యాణ్ అన్న‌.. ఈ చిత్రానికి అద్బుత‌మైన విజ‌యం చేకూరుతుంద‌ని.. ఇంకా ఎన్నో అద్బుత‌మైన సినిమాలు చేయ‌డానికి ఈ చిత్రం మిమ్మ‌ల్ని ప్రోత్స‌హిస్తుంద‌ని, ఆ దేవుడ్ని మ‌న‌సారా కోరుకుంటున్నాను. సినిమా మార్చి 1న విడుద‌ల‌వుతుంది`` అన్నారు.
నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ - ``ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్లు క‌ల్యాణ్‌ను చూస్తున్నాను. త‌న‌లో ఓ త‌ప‌న క‌న‌ప‌డుతుంటుంది. మంచి సినిమాలు చేయాల‌ని, కొత్త‌దనాన్ని అందించాల‌నే త‌ప‌నే ఎన్టీఆర్ ఆర్ట్స్‌ను స్థాపించారు. బాల‌గోపాలుడులో బాల‌న‌టుడిగా న‌టించారు. ఆ సినిమాను డైరెక్ట్ చేసిన కోడిరామ‌కృష్ణ‌గారు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం ఎంతో బాధాక‌రం. ఆయ‌న ద‌ర్శ‌కత్వంలో మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, ముద్దుల మావ‌య్య‌, మువ్వ‌గోపాలుడు, బాల‌గోపాలుడు, భార‌తంలో బాల‌చంద్రుడు ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాను. ఇక 118 సినిమా విష‌యానికి వ‌స్తే.. సినిమా ఎలాంటిదో ఊహించ‌లేన‌ట్లుగా, యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా టైటిల్ ఉందని చెప్ప‌డంలో సందేహం లేదు. ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. గుహ‌న్‌గారు తెలుగులో డైరెక్ట్ చేసిన తొలి సినిమా. ఆయ‌న ఇంకా ఎన్నో మంచి సినిమాల‌ను డైరెక్ట్ చేయాలి. ఈ సినిమా అఖండ విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. పేరు ప్ర‌తిష్టలు, ఆర్ధికంగా నిర్మాత‌ల‌కు మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

Recent News