జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ 

24 Feb,2019

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఏపీలో జరగబోయే ఎలక్షన్స్ పూర్తి అయ్యాక ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. కాగా తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ ను ‘జూన్’ నుండి మొదలుపెట్టనున్నారు. అలాగే ఈ నెలాఖర్లో పూజా కార్యక్రమాలను జరుపనున్నారు.  గతంలో బాలయ్యకి ‘సింహ, లెజెండ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన బోయపాటి, ఈ సారి అలాంటి సూపర్ హిట్ ని ఇచ్చి.. వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తాడేమో చూడాలి. ఆయితే ఈ కొత్త చిత్రం పై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదట. కేవలం ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది.
  

Recent News