రజినీ సరసన నయనతార 

19 Feb,2019

ఇటీవల ‘పేట’ చిత్రం తో ప్రేక్షకులముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ తన తరువాతి చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ తోచేయనున్నారు. ఈ చిత్రంలో తలైవా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ చిత్రంలో రజినీ కి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార ను తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు నయన్ ,రజినీ సరసన ‘చంద్రముఖి , కథానాయకుడు’ చిత్రంలో నటించగా శివాజీ లో ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నయనతార చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా వుంది. మరి మరోసారి రజినీ తో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.

Recent News