గోపిచంద్ హీరొగా తిరు దర్శకత్వం లో అనిల్ సుంకర నిర్మిస్తొన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ దగ్గర గల మాండవ లొ చిత్రీకరణ జరుపుకుంటొంది. ఈ రోజు తో అక్కడ చిత్రీకరణ ముగించుకుంటొన్న నేపథ్యంలో హీరో గొపిచంద్ పై బైక్ చేజింగ్ పోరాట సన్నవేశాలు చిత్రీకరణ చెస్తున్న సమయంలో బైక్ స్కిడ్ అవ్వటంతో స్వల్ప గాయాలయ్యాయి. గోపిచంద్ ఆరొగ్యానికి ఎలాంటి హాని లేదని, గాయాలకు ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం మిగిలిన చిత్రీకరణ చెసుకొవచ్చని అక్కడి ఫోర్టీస్ హాస్పిటల్స్ డాక్టర్స్ తెలిపారు.