ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం రెండో షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం కావడంతో ఈ సినిమా పై అనేక ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని చిత్రబృందం ధృవీకరించాల్సి ఉంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ అతిథి పాత్రలో నటించనున్నట్లు టాక్. అతిథి పాత్ర అయినప్పటికీ ఆయన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్చరణ్ గెటప్లు మొదలుకుని పాత్రల వరకు విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.