సైరాలో అల్లు అర్జున్ 

13 Feb,2019

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడని సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వస్తున్నాయి.   తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీ నిజంగానే ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.  ఈ చిత్రంలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నటిస్తే.. సినిమా పై ఇంకా అంచనాలు పెరుగుతాయి. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Recent News