బాహుబలిని దాటేసిన కె జి ఎఫ్ 

12 Feb,2019

కేవలం నటవారసత్వ ం రాజ్యమేలే పరిశ్రమలో వారసుల్ని సైతం వెనక్కి నెట్టి ఇండస్ట్రీ బెస్ట్ రికార్డును అందుకున్నాడు యాష్. ఒక సాధారణ డ్రైవర్ కొడుకు.. ఎవరికీ సాధ్య ం కాని అసాధారణ ఫీట్ వేశాడు. భారతీయ సినిమా చరిత్రలో ఇదో సంచలనం. ప్రస్తుతం అతడు డ్రైవర్ కొడుకు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ నంబర్ 1 హీరోగా ఎదిగాడు. ``అసలు ఈ హీరో ఎవరు? యశ్ పేరు చెబితేనే కన్నడ పరిశ్రమ షేక్ అవుతోంది. శివరాజ్ కుమార్ లు.. రాజ్ కుమార్ ల శకం పోయి యశ్ యుగం వచ్చింది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇది అసాధారణ ఫీట్. ఒకే ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు ఒకే ఒక్క సినిమా అతడి దశ దిశ తిప్పేసింది. కేజీఎఫ్ - ఛాప్టర్ 1 సంచలన విజయం సాధించి ప్రస్తుతం యశ్ ని ఇంటర్నేషనల్ స్టార్ ని చేసేసింది. ఈ సినిమా ముగింపు కలెక్షన్స్ లిస్ట్ ఇంకా రాలేదు. అంతకు ముందే దాదాపు 243కోట్లు వరల్డ్ వైడ్ వసూళ్లు సాధించిందని రిపోర్ట్ . కేవలం 50 రోజుల్లో సాధించిన వసూళ్లు ఇవి. కేజీఎఫ్- 1 ఇంకా వసూళ్లు సాగిస్తూనే ఉంది.  కేవలం ఒక్క కర్నాటకలోనే వసూలు చేస్తోందా? అంటే అన్నిచోట్లా అదే హవా. కర్నాటకలో బాహుబలి 2 చిత్రం 100 కోట్లు సుమారు వసూలు చేస్తే ఆ రికార్డును బ్రేక్ చేస్తూ కేజీఎఫ్ 1 చిత్రం ఏకంగా 137 కోట్ల వసూళ్లు సాధించిందని ట్రేడ్ టాక్.  కేజీఎఫ్ విజయం ప్రపంచానికి ఒక గొప్ప గుణపాఠం. బాహుబలి తర్వాత మళ్లీ ఆ క్రేజు ఓ సౌత్ సినిమాకే దక్కిందనడంలో సందేహం లేదు.  ముఖ్య ంగా కర్నాటకలో కోలార్ బంగారు గనుల్లో బానిసత్వ ం మాఫియా అన్న ఎలిమెంట్ ఇంత పెద్ద రేంజులో వర్కవుట్ అవుతుందని మేకర్స్ ఊహించి ఉండరు.  కేజీఎఫ్ - ఛాప్టర్ 2 చిత్రం ప్రస్తుతం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో సంజయ్ దత్ విలన్ గా నటించనున్నారని తెలుస్తోంది. 

Recent News