14న భారీగా విడుదలవుతున్న లవర్స్ డే
- నిర్మాతలు ఏ గురురాజ్, సిఎచ్ వినోద్ రెడ్డి
కన్నుగొట్టి .. దేశవ్యాప్తంగా క్రేజ్ క్రియేట్ చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ప్రియా వారియర్, రోషన్ జంటగా నటించిన మలయాళ చిత్రం `ఒరు ఆధార్ లవ్`. ఈ చిత్రాన్ని తెలుగులో `లవర్స్ డే` పేరుతో సుఖీభవ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది. ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్రెడ్డి నిర్మాతలు. ఒమర్ లులు దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని ఈ నెల 14న విడుదల అవుతున్న సందర్బంగా నిర్మాతలు ఏ గురురాజ్, సిఎచ్ వినోద్ రెడ్డి వివరాలు తెలియచేస్తూ .. నేను ఓ సాధారణ స్థాయినుండి అనూహ్యంగా ఎదిగాను .. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. నిర్మాతగా ఇప్పటికే పలు చిత్రాలను నిర్మించాను .. అయితే తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వాలని లేదు .. కాకపోతే మంచి సినిమా తీయాలన్న సంకల్పం మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మలయాళం సినిమా ఓరు ఆధార్ లవ్ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే పేరుతొ విడుదల చేస్తున్నాం. ప్రపంచ వ్యాపంగా క్రేజ్ తెచ్చినా సినిమాలు రెండే .. అందులో వై దిస్ కొలవరి అంటూ ధనుష్ సంచలనం రేపితే .. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అంటూ బాహుబలి సినిమా ఓ రేంజ్ సంచలనం రేపింది .. తాజాగా కన్ను కొట్టి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది ప్రియా వారియర్. ప్రియా వారియర్ అంటే దేశవ్యాప్తంగా క్రేజ్ మాములుగా లేదు. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం భారీ పోటీ మధ్య మేము సొంతం చేసుకున్నాం. నిజంగా చిన్న చిత్రాల్లోనే ఈ సినిమా డబ్బింగ్ హక్కుల్లో రికార్డ్ ధరకు అమ్ముడైంది. దర్శకుడు ఒమర్ లులు అద్భుతంగా తెరకెక్కించాడు. తప్పకుండా తెలుగులో సంచలన విజయం అందుకుంటుంది. ముక్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ రావడంతో ఈ సినిమా పై హైప్ ఇంకా పెరిగింది . ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు. మా మిత్రుడు వినోద్ రెడ్డి తో కలిసి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాం అన్నారు. మరో నిర్మాత వినోద్ రెడ్డి మాట్లాడుతూ .. ఈ సినిమాకు ఇప్పటికే మంచి క్రేజ్ నెలకొంది . ముక్యంగా ఆడియో, టీజర్ బాగా పాపులర్ అయ్యాయి. తెలుగుతో పాటు ఓవర్ సీస్ లోకూడా విడుదల చేస్తున్నాం అన్నారు.