అక్కినేని అఖిల్ 'మిస్టర్ మజ్ను'తో తప్పకుండా హిట్ కొడతాడని అభిమానులు భావించారు. కానీ ఈ సినిమా కూడా ఆశించినస్థాయిలో హిట్టందుకోలేదు. దాంతో తన నాల్గొవ సినిమాను 'మలుపు' దర్శకుడు సత్య పినిశెట్టి దర్శకత్వంలో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో అఖిల్ తదుపరి సినిమాకి క్రిష్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడనే మరో ప్రచారం మొదలైంది. అయితే ఆ వార్తలో నిజం లేదని, సత్య పినిశెట్టి దర్శకత్వంలోనే అఖిల్ సినిమా ఖరారైందని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ ను నాగ్ పూర్తిగా వినేయడం .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయట. అఖిల్ ఇంతకు ముందు చేసిన మూడు సినిమాలు ఆయా కారణాల వలన ఎక్కువ గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్టు విషయంలో మాత్రం ఆలస్యం చేయరట. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.