నిఖిల్ ముద్ర మారిందిగా 

06 Feb,2019

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం 'ముద్ర' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం రేకెత్తడంతో ఫిలింమేకర్స్ టైటిల్ ను మార్చారు.  'ముద్ర' ను 'అర్జున్ సురవరం' గా మార్చి కొత్త టైటిల్ లోగో కూడా రిలీజ్ చేశారు.  టి యెన్ సంతోష్ దర్శకత్వంలో  హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం యొక్క టైటిల్, విడుదల తేదీ లను అధికారికంగా ప్రకటించారు.    నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. సోషల్ ఇష్యూస్ బేస్ చేసుకుని తెరకెక్కతుంది ఈ చిత్రం. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 29న గ్రాండ్ గా విడుదలకానుంది.

Recent News