విశాల్ అయోగ్య ట్రైలర్ వస్తుంది 

05 Feb,2019

తెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ చిత్రాన్ని తమిళంలో హీరో విశాల్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మద్యే వరుస విజయాలతో జోరుమీదున్న విశాల్ కెయిర్ లో ఈ అయోగ్య సంచలన విజయం సాధిస్తుందన్న టాక్ ఉంది. దాంతో పాటు బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో విశాల్ కనిపించనున్నాడు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా నటిస్తోంది. 'ఠాగూర్' మధు నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి రేపు తమిళ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన 'టెంపర్' సినిమాకి ఇది రీమేక్. హిందీలో 'టెంపర్' సినిమాకి రీమేక్ గా వచ్చిన 'సింబా' అక్కడ భారీ వసూళ్లను సాధించింది. అలాగే తమిళంలోను ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి. 

Recent News