పురుష కళాకారుల ఆధిపత్య ప్రపంచంలో, మహిళా వాద్యకారులు అపారమైన ప్రతిభ, పాఠవాలు ఉన్నప్పటికీ, తగిన గుర్తింపు కోసం చాలా కష్టపడ్డారు. మహిళా వాద్యకారుల ప్రతిభని గుర్తించడానికి గౌరవించడానికి ప్రపంచంలోనే ప్రత్యేకంగా వారి కోసం మొట్టమొదటి కాన్సర్ట్ సిరీస్ నిర్వహిస్తోంది 'విమెన్ ఆఫ్ రిథమ్'.
ఈ సంస్థ భారతదేశంలోని పురుషాధిక్య పెర్కుషన్ పరిశ్రమలో ఒక విప్లవాత్మక మార్పుని తీసుకొచ్చింది. మహిళా సాధికారత కోసం పాటుపడుతూ కళలు, సంప్రదాయాలని ప్రోత్సహించే టీ.ఆర్.ఎస్ ఎం.పి కల్వకుంట్ల కవిత శనివారం హైదరాబాద్ కాన్సర్ట్ పోస్టర్ని విడుదల చేశారు. అద్భుత మహిళా కళాకారులను హైదరాబాద్కి తీసుకొచ్చినందుకు బ ందాన్ని ఆమె అభినందించారు.
'విమెన్ ఆఫ్ రిథమ్' మొదటి 3 సీజన్స్లో భారతదేశంలోని ప్రముఖ మహిళా పెర్క్యూసన్ వాద్యకారులలో 20 మంది కచేరీలలో తమ ప్రతిభ ప్రదర్శించారు. డ్రమ్స్లో అనన్య పాటిల్, ఘటంలో సుకన్య రామగోపాల్, మహీవా ఉపాధ్యాయ్, సవని తల్వాల్కర్, పఖవజ్ మరియు తబల, చారు చైల్డ్ ప్రాడిజీ రాహితా, చందా వంటి అనేక మంది ఇందులో పాల్గొన్నారు. వారి ప్రదర్శనతో అభిమానులతో పాటు మీడియా ప్రశంసలు కూడా పొందారు.
మార్చి 10, సాయంత్రం 7 గంటల నుండి సిసిఆర్టి అంఫి థియేటర్, మాధాపూర్లో జరగబోవు 4వ ఎడిషన్లో అత్యుత్తమ మహిళా సంగీతకారులని చూస్తారు. విజయవాడకి చెందిన దండమూడి సమ్మతి రామమోహరావు మ దంగం, సుకన్య రామ్గోపాల్ ఘటం, మిథాలి ఖర్గోవన్కర్ తబలా, డెబోప్రియ రణదీవ్ ఫ్లూట్, చందనా బాల గాత్రంతో హైదరాబాద్ ప్రేక్షకులని సమ్మోహనపర్చనున్నారు. మార్చిలో జరగనున్న ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చనున్న ఈ మహిళా సంగీతకారులని సత్కరించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మించిన సందర్భం లేదు.
'విమెన్ ఆఫ్ రిథమ్' సీజన్ 4ను ఎలెవెన్ పాయింట్ టూ సంస్థ హోస్ట్ చేస్తోంది. 'ఎలెవెన్ పాయింట్ టూ' ఇంతకుముందు ఇళయరాజా, శోభనా మరియు కె.జె.ఏసుదాస్ పదర్శనలను విజయవంతంగా నిర్వహించింది. హైదరాబాద్కి చెందిన 'మోటివిటీ ల్యాబ్స్'తో కలిసి 'ఎలెవన్ పాయింట్ టూ' ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.. ఎటువంటి ఎంట్రీ ఫీ లేదు.