ఏంటి గోపీచంద్ చేస్తున్నది రేమేకా 

04 Feb,2019

అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు ? ఈ మధ్య వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న గోపీచంద్ కు ఇప్పుడు తప్పనిసరిగ్గా సక్సెస్ కావాలి. అందుకోసం అయన హిందీ రీమేక్ సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే తాజాగా గోపీచంద్ సినిమా ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో మొదలైన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు తీరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఏక్తా టైగర్ కు రీమేక్ అని టాక్ ? అయితే ఈ విషయం పై ఎలాంటి సమాచారం అయితే లేదు .. కానీ సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా రీమేక్ అంటూ ప్రచారం జరుగుతుంది. కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ఏక్తా టైగర్ 2012 లో విడుదలై భారీ విజయాన్ని అందుకుని ఏకంగా 130 కోట్లు వసూలు చేసింది. మరి ఇది దానికి రేమేకా కాదా అన్న విషయం పై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 

Recent News