అర్జున్ రెడ్డి తో టాలీవుడ్ క్రేజీ హీరోగా మారిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాతో పాటు విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరోలా సినిమా చేస్తున్నాడు .. దాంతో పాటు తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పాడట . ఇటీవలే అందరు కొత్త వాళ్లతో .. హుషారు సినిమా తీసి సక్సెస్ అందుకున్న శ్రీహర్ష దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట. ఇటీవలే దర్శకుడు కథను చెప్పి ఒప్పించాడట. సో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.