మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా చిత్రం షూటింగ్ జోరుగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమాలో గ్లామర్ భామ అనుష్క ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందట !! ఇప్పటికే హీరోయిన్స్ గా నయనతార, తమన్నాలు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రత్యేక పాత్రకోసం అనుష్క ను ఎంచుకున్నారట. ఈ పాత్ర కేవలం అనుష్క మాత్రమే చేయగలదని భావించిన మేకర్స్ ఆమెతో చర్చలు జరిపి ఓకే చేయించారట. టాలీవుడ్ లో అనుష్క అంటే ఓ ప్రత్యేకమైన క్రేజ్. లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో సత్తా చాటిన అనుష్క .. బాగమతి తరువాత సినిమాలు చేయడం లేదు. దానికి కారణం జీరో సైజ్ సినిమా కోసం బాగా బరువు పెరగడంతో ఇప్పుడు ఆ బరువు తగ్గే పనిలో ఉంది. మొత్తానికి అనుష్క కీ రోల్ తో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.