ప్రస్తుతం ఎన్టీఆర్ మహానటుడు పనుల్లో బిజీగా ఉన్న బాలయ్య నెక్స్ట్ సినిమా విషయంలో కాస్త తొందరగానే నిర్ణయం తీసుకున్నాడు. అయన నెక్స్ట్ సినిమా బోయపాటి శ్రీను తో ఉండనుంది. అయితే బోయపాటి శ్రీను లేటెస్ట్ గా రామ్ చరణ్ తో తీసిన వినయ విధేయ రామ సంక్రాంతి కానుకగా విడుదలై భారీ పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమా విషయంలో చాల నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. బోయపాటి ఓవర్ యాక్షనే ఆ సినిమాను పెద్ద డిసాస్టర్ గా నిలబెట్టిందన్నా కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా బాలయ్య తో బోయపాటి సినిమా అనగానే నందమూరి అభిమానులు టెన్షన్ పడుతున్నారట. అయితే బోయపాటి తో సినిమా విషయంలో చరణ్ చేసిన తప్పు నేను చేయనని చెబుతున్నాడు బాలయ్య !! అవును కథ విషయంలో దర్శకుడిని గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళలేనని .. అందుకే కథ చర్చలు ఎక్కువ సేపు జరిగాయట. అలాగే బౌండ్ స్క్రిప్ట్ అయ్యాకే సెట్స్ పైకి వెళదామని బోయపాటికి గట్టిగ చెప్పాడట బాలయ్య !! నిజానికి కథల విషయంలో ఒక్కసారి కథ విని ఓకే చేసాక పూర్తిగా దర్శకుడిని నమ్మేసి .. అతను ఎలా చెబితే అలా చేసే బాలయ్య ఇప్పుడు కథల విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. మరి ఈ సినిమా విషయంలో బోయపాటి ఎం చేస్తాడో చూడాలి.