టాలీవుడ్ లో నిర్మాత దిల్ రాజు అంటే ఓ బ్రాండ్. ఎందుకంటే వరుసగా అయన అందుకుంటున్న విజయాలు మారె నిర్మాత అందుకోకపోవడం. దిల్ రాజు బ్యానర్ లో సినిమా వచ్చిందంటే .. అటు ఫ్యామిలి ప్రేక్షకులతో పాటు కుర్రకారుకు ఆసక్తే. కేవలం నిర్మాతగానే కాకుండా అటు డిస్ట్రిబ్యూటర్ గా వరుస విజయాలు అందుకుంటున్న అయన నిర్మించిన ఎఫ్ 2 సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం అందుకోవడంతో పాటు ఏకంగా వందకోట్ల మార్కెట్ ని దాటేసింది. వెంకటేష్ , వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ముఖ్య పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ న్నా సందర్బంగా అయన గురువారం మీడియా తో మాట్లాడారు .. ఆ విశేషాలు అయన మాటల్లో .. 2017 ఎంత సక్సెస్ ఫుల్ గా గడిచిందో, 2019 కూడా అదే స్థాయి సక్సెస్ ని ఇస్తుందనిపిచ్చింది. కొత్త సంవత్సరంఆరంభంలోనే ఇంత పెద్ద సక్సెస్ ని అందించినందుకు అందరికీ పెద్ద థాంక్స్ చెబుతున్నా . ఎఫ్ 2 కు సీక్వెల్ ఐడియా ఉంది. దానిని ఎఫ్ 3 పేరుతొ 2020 లో ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడున్న టీమ్ తో పాటు ఈ సారి ముగ్గురు హీరోలు ఉంటారు. ప్రస్తుతానికి రవితేజ అనుకుంటున్నాం కానీ, ఏదైనా స్క్రిప్ట్ అయిన తరవాతే క్లారిటీ వస్తుంది. గత ఏడాది 6 సినిమాలు చేయాలని నేనేమీ అనుకోలేదు, జరిగిపోయింది. వరుసగా ఆరు విజయాలు రావడం అదృష్టం .. అయితే 2018 లో ఆశించిన ఫలితాలు రాలేదు. అలాగని ఈ ఇయర్ కూడా 6 సినిమాలు చేయాల్సిందే అని ఫిక్సయితే, బోల్తా పడే చాన్స్ ఉంది కాబట్టి దాని గురించి అంత ఖచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతానికి నాలుగైదు కథలైతే సిద్ధంగా ఉన్నాయి. మా నెక్స్ట్ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’ రీమేక్ ఉంటుంది. తమిళంలో ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తాడు. శర్వానంద్, సమంతా లీడ్ రోల్ ప్లే చేస్తారు. నా కరియర్ లో ఇది ఫస్ట్ రీమేక్.
‘96’ తమిళంలో క్లాసిక్ సినిమా అనిపించుకుంది. తెలుగులో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఫస్ట్ కాపీ చేతికి వస్తే కానీ తెలీదు. నాకైతే సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ‘96’ ఫీల్ ఉన్న సినిమా. రెండు పాత్రల మధ్య ఒక జెన్యూన్ ఫీల్ ని దర్శకుడు తీసుకెళ్లిన విధానం అద్భుతమనిపించింది. సినిమాని తమిళంలో, చూసీ చూడగానే ప్రొడ్యూసర్ ని కలిసి, వెంటనే డైరెక్టర్ తో ఈ సినిమా తెలుగులో కూడా నువ్వే చేయాలి అనేశా. ఇక ఎఫ్ 2 సినిమా సక్సెస్ విషయంలో ఎక్కువ మార్కులు దర్శకుడు అనిల్ కె వేయాలి. తాను అద్భుతమైన కథను తీసాడు. అలాగే నటీనటులు, టెక్నీషియన్స్ అందరికి ప్రత్యేకంగా థాంక్స్ చెబుతున్నా. ముక్యంగా ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు పెద్ద థాంక్స్. ఇక నెక్స్ట్ సినిమాల గురించి చెప్పాలంటే నాగ చైతన్య తో సినిమా ఉంటుంది. స్క్రిప్ట్ కూడా పూర్తయింది. ఎప్పుడు మొదలవుతుందనేది త్వరలో తెలియచేస్తా. దాంతో పాటు రాజ్ తరుణ్ తో ఓ సినిమా. అలాగే సతీష్ అనే కొత్త దర్శకుడితో పలుకే బంగారమాయె టైటిల్ తో ఓ సినిమా. ఇక మహేష్ మహర్షి సినిమా ఇటీవలే విదేశాల్లో షూటింగ్ పూర్తీ చేసాం. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుంది. ఈ సినిమాను ముందు ఏప్రిల్ 5న విడుదల అనుకున్నాం .. కానీ అనుకున్న టైం లో షూటింగ్ పూర్తీ కాలేదు కాబట్టి ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నాం అంటూ ముగించారు.