ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘118’. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన నివేత థామస్ అలాగే ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. మొదటిసారి కేవీ గుహన్ డైరక్టర్ గా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా థ్రిల్లింగ్ అంశాలతో చాలా బాగా ఆకట్టుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో అండర్ వాటర్ లో జరిగే క్రేజీ ఫైట్ సీక్వెన్స్ చాలా వచ్చిందని టాక్. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకం ఫై మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.