భిన్నమైన గెటప్స్ లో స్వ‌యంవ‌ద 

01 Feb,2019

ఆదిత్య అల్లూరి, అనికా రావు  జంట‌గా  ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై వివేక్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తోన్న `స్వ‌యంవ‌ద` సినిమా ఫస్ట్ లుక్ ను ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ:స్వయంవద సినిమా టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందొ సినిమా కూడా అంతే పవర్ ఫుల్ గా వుంటుందనుకుంటున్నాను. ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ సినిమా ను తెరకెక్కించారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ వ‌ర్మ మాట్లాడుతూ,   స్వయంవద    అనేది సాంస్కృత ప‌దం. దీనికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. తన గురించి తానే  స‌ర్వ‌స్వం అనే ఓ పాత్ర గురించి సినిమాలో చెప్ప‌బోతున్నా. ఇందులో హీరోయిన్ మొత్తం 6 గెట‌ప్స్ లో క‌నిపిస్తుంది. అన్ని గెట‌ప్స్ లోను డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ ఇస్తూ చాలా చక్కగా నటించింది అనికా రావు. హీరో ఆదిత్య అల్లూరి కొత్తవాడైనా చక్కగా నటించాడు. అందరికీ నచ్చే విధంగా  కామెడీ, స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాం.   అన్నారు.  నిర్మాత రాజా దూర్వాసుల మాట్లాడుతూ: సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి.టీజర్ ను పిబ్రవరి10న రిలీజ్ చేస్తాము.సినిమా ను మార్చి లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము అన్నారు. 

Recent News