సంపత్ నంది కొత్త చిత్రానికి లైన్ క్లియర్ 

01 Feb,2019

‘గౌతమ్ నంద’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది. గోపిచంద్ నటించిన ఈ చిత్రం 2017లో విడుదలై బాగుంది అనిపించుకున్న బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇక తాజాగా సంపత్ నంది మళ్ళీ తన కొత్త చిత్రాన్ని గోపిచంద్ తోనే చేయనున్నాడు. ఇటీవల గోపిని కలిసి ఫైనల్ నరేషన్ ఇచ్చాడట. వెంటనే గోపి కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ఇచ్చాడని టాక్ . చిత్రం మే లో సెట్స్ మీదకు వెళ్లనుంది. గోపిచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో తన 26వ చిత్రంలో నటిస్తున్నాడు. అన్ని కుదిరితే ఈ రెండు చిత్రాలు కూడా ఇదే ఏడాది లో విడుదలకానున్నాయి. 

Recent News