థ్రిల్లర్ నేపథ్యంలో అనసూయ కథనం 

30 Jan,2019

హాట్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో అవసరాల శ్రీనివాస్, రణధీర్ ముఖ్య పాత్రల్లో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో థి మంత్రా ఎంటర్ టైనేమేంట్స్ , ది గాయత్రీ ఫిలిమ్స్  పతాకాలపై నరేందర్ రెడ్డి, చుక్కా శర్మ నిర్మిస్తున్న చిత్రం కథనం. ఈ రోజుతో తాకి పార్ట్ పూర్తీ చేసుకుంటున్న సందర్బంగా రామానాయుడు స్టూడియోస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ టీమ్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అనసూయ మాట్లాడుతూ . . కథను నడిపించే కథనం టైటిల్ తో వస్తున్నా ఈ సినిమాలో మంచి పాత్ర వేస్తున్నాను. నిజానికి ఈ సినిమాలో అందరు క్షణం లోని పాత్ర తరహాలో ఉంటుందని అంటున్నారు .. కానీ కాదు ఇందులో భిన్నమైన పాత్ర నాది. సినిమా  యూనిట్ లో పనిచేసే అసోసియేట్ డైరెక్టర్ గా కనిపిస్తాను. సరికొత్త థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. దర్శకుడు రాజేష్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. నేటితో టాకీ పార్ట్ పూర్తవుతుంది. క్షణం, రంగస్థలం సినిమాల తరువాత ఆ రేంజ్ లో  క్రేజ్ తెచ్చే పాత్ర ఇది అన్నారు. రణధీర్ మాట్లాడుతూ .. ధ్రువ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నాను. మంచి పాత్ర. అనసూయ తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. తాను మంచి నటి. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది అన్నారు. నిర్మాత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ .. నేను డిస్ట్రిబ్యూటర్ గా నెల్లూరులో పలు చిత్రాలను పంపిణి చేశాను .. నిర్మాతగా మా మిత్రుడితో కలిసి మంగళ సినిమా తీసా .. సోలోగా ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. దర్శకుడు రాజేష్ చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఈ సినిమా తీస్తున్నాను. అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఉంటుంది. సమ్మర్ లో విడుదల చేస్తామన్నారు. దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ .. సరికొత్త థ్రిల్లర్ నేపద్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాను. తప్పకుండా అందరికి నచ్చేలా ఉంటుంది అన్నారు. 
 

Recent News